Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఎల్పీ నేత భట్టికి మంద కృష్ణ థాంక్స్!

సీఎల్పీ నేత భట్టికి మంద కృష్ణ థాంక్స్!
సీఎల్పీ కార్యాలయంలో విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ, ఎస్టీ కానిస్టేబుల్ అభ్యర్థులు
సీఎల్పీ నేతను భారీ గజమాలతో సత్కరించిన కానిస్టేబుల్ అభ్యర్థులు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను బుధవారం సీఎల్పీ కార్యాలయంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కానిస్టేబుల్ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి కృతజ్ఞతలు తెలిపారు. శాలువా కప్పి గజమాలతో సత్కరించారు.‌
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ సమావేశంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కట్ ఆఫ్ మార్కులు తగ్గిస్తానని సీఎంతో సానుకూలంగా ప్రకటన చేయించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు సీఎల్పీ నేత భట్టిని సన్మానించారు .

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకరావడంతోపాటు సీఎం కేసీఆర్ ను కన్విన్స్ చేసే విధంగా మాట్లాడటం భట్టి ప్రస్తవించిన అమాశాలపై సీఎం స్పందించడం మనం చూస్తున్నాం … కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించడంలో భట్టి చేసిన కృషికి మంద కృష్ణ మాదిగ సైతం భట్టి వద్దకు వచ్చి అభినందనలు తెలపడం విశేషం .

Related posts

తెనాలి ఆటో డ్రైవర్ నిజాయతీకి పోలీసుల ఫిదా!

Drukpadam

ఏపీలో ఉపాధ్యాయుల విషయంలో హరీష్ రావు కామెంట్ …కౌంటర్ ఇచ్చిన బొత్స..

Drukpadam

ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ కరీంనగర్ కు బదిలీ – కొత్త కలెక్టర్ గా విపి గౌతమ్…

Drukpadam

Leave a Comment