Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేను దూరం: రాహుల్ గాంధీ!

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేను దూరం: రాహుల్ గాంధీ!

  • కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోటీపై స్పందించిన రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ప్రకటన
  • ఈ దఫా గాంధీయేతర వ్యక్తే అధ్యక్షుడు అవుతారని ప్రకటన

తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో లేనని సీనియర్ కాంగ్రెస్ నేత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు . కాంగ్రెస్ లోని అనేక మంది సీనియర్లు , వివిధ రాష్ట్రాల పిసీసీలు , ఎంపీలు , ఇంకా చాలామంది రాహుల్ గాంధీనే అధ్యక్షుడు కావాలని బలంగా కోరుకుంటున్నారు . అందుకు అనుగుణంగా తీర్మానాలు సైతం చేసి ఏఐసీసీ కి పంపుతున్నారు.భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిపై క్లారిటీగానే ఉన్నారు . ఈమేరకు ఆయన తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు . ఈసారి గాంధీ యేతర కుటుంబ వ్యక్తే అధ్యక్షుడు అవుతారని కూడా ఆయన చెప్పడం గమనార్హం .దీంతో ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ తప్పేట్లు లేదు . ఇప్పటికే అశోక్ గేహలోట్ ,శశిథరూర్ , పేర్లు అధ్యక్ష పదవికోసమే ప్రచారం లో ఉండగా కొత్తగా దిగ్వ జయ్ సింగ్ పేరుకూడా వినపడుతుంది. మరికొంత మంది కూడా నామినేషన్లు వేస్తారని ప్రచారం జరుగుతుంది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక రసవత్తరంగా మారె అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన గురువారమే ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో లేనంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తాను ఇదివరకే చెప్పానని కూడా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీకి తాను దూరంగా ఉంటానని కూడా రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తే అధ్యక్షుడు అవుతారని రాహుల్ గాంధీ మరో కీలక వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం తాను చేస్తున్న భారత్ జోడో యాత్రను ఓ సామాన్య పార్టీ కార్యకర్త హోదాలోనే చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోలింగ్ తప్పనిసరి అని తేలిపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే అధ్యక్ష బరిలో నిలిచేందుకు శశి థరూర్, అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్ తదితరులు సిద్ధపడగా… మరింత మంది పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

Related posts

యూపీలో మేజిక్ ఫిగ‌ర్ దాటేసిన బీజేపీ.. క‌మ‌లం పార్టీకి భారీ విక్ట‌రీ!

Drukpadam

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ అధ్యక్షుడిగా తాతా మధు… ఎవరి ఛాయస్ …

Drukpadam

బండి ఇలాఖాలో అసమ్మతి గళం: రహస్య సమావేశం.. హై కమాండ్ ఆరా!

Drukpadam

Leave a Comment