కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో లేరా…?
ఏ పార్టీలోకి వెళ్తాననే విషయాన్ని ఎన్నికలకు ముందు చెపుతానని వ్యాఖ్య
షర్మిల ఘటన భాధాకరమన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి
షర్మిల ఘటనను అందరూ ఖండించాలన్న కోమటిరెడ్డి
ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని వెల్లడి
బీజేపీలోకి వెళతారా ? షర్మిలకు జైకొడతారా …??
భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అసమ్మతినేత …అయితే ఆయన ఇప్పుడు తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతున్నారు .ఏపార్టీలోకి వెళ్లే విషయం ఎన్నికలకు ముందు ప్రకటిస్తానని అంటున్నారు . ఇంతకీ వెంకటరెడ్డి కాంగ్రెస్ కు బై చెప్పినట్లేనా ?అంటే అవుననే అభిప్రాయాలే కలుగుతున్నాయి. మునుగోడు ఎన్నికల్లో తనసోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీచేయగా కాంగ్రెస్ ఎంపీ గా ఉన్న వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ కాల్ చేశారని అభియోగాలు రావడంతో ఆయనకు అధిష్టానం షోకాజు నోటీసులు జారీచేసింది.దానికి ఆయన నుంచి సరైన రీతిలో సమాధానం రాలేదనే అభిప్రాయం ఉంది. ఆయన కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు . ఇటీవలనే ఆయన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలుస్తానని అన్నారు . కానీ ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదని తెలుస్తుంది .అందువల్ల ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు . ఆయన ఏపార్టీ లో చేరతారు .బీజేపీలోనా లేక వైయస్సార్ తెలంగాణ పార్టీలోనే అనేది ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగానే ఆయన షర్మిలపై జరిగిన ఘటనల గురించి స్పందించారు .
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. షర్మిల ఘటనను అందరూ ఖండించాలని చెప్పారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. మరో ఏడాదిన్నర పాటు తన నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి పెడతానని చెప్పారు. తాను ఏ పార్టీలోకి వెళ్తాననే విషయాన్ని ఎన్నికలకు నెల ముందు చెపుతానని అన్నారు. వేరే పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని బలం అనుకుంటోందని టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.