ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిషోర్ సంచలన నిర్ణయం
-ఎన్నికల మేనేజ్మెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
-ఆశ్చర్యపోయిన రాజకీయ వర్గాలు
– బెంగాల్ లో ఆయన అంచనాలు నిజమైన వేళ తప్పుకోవడం పై సందేహాలు
-వత్తిడి జరిగిందా ? స్వచ్ఛందమేనా ?
2014 కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు నరేంద్ర మోడీ గద్దెనెక్కన్తా వరకు అన్ని తానై వ్యవహరించి మంచి ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత కిషోర్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇక నుంచి తాను ఎవరికీ వ్యూహకర్తగా పనిచేయనని ఆయన ప్రకటించడంపై రాజకీయవర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్ లో మమతా బెనర్జీకి ఎన్నిక వ్యూహాక్రాంతగా వ్యవహరించిన ప్రశాంత కిషోర్ ,బీజేపీ కి డబుల్ డిజిట్ దాటదని , మమతా మంచి మెజారిటీ తో అధికారంలోకి వస్తారని జోశ్యం చెప్పారు. అనేక టీవీ ఛానల్స్ డిబేట్లలోనూ ఆయన బీజేపీ కి బెంగాల్ లో 100 సీట్లు దాటితే తాను ఎన్నకల మేనేజ్మెంట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కానీ అందుకు విరుద్ధంగా బెంగాల్లో ఆయన చెప్పిన విధంగానే జరిగినప్పటికీ ఎందుకో ఎన్నికల మెంజ్మెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సందేహాలకు తావిస్తుంది. ఆయన పై ఎవరైనా వత్తిడి తెచ్చారా ? అసలు ఏమి జరిగింది. సడన్ గా ఎందుకు తప్పుకుంటున్నారు. అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆయన పేరుతొ ఒక ప్రకటన విడుదలైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రకటన నిజమేనా కారణాలు ఏమిటి అనే విషయాలను పలువురు రాజకీయ ,మీడియా ప్రతినిధులు ఆరా తీస్తున్నారు. ఆయన ప్రకటన అయితే వచ్చింది కానీ ఆయన అందుబాటులోకి రాలేదు . వస్తే కానీ అసలు విషయం తెలుస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.