తిరుపతి వైసీపీ గెలిచింది … సత్తా చాటలేదు
-ఐదు లక్షల మెజార్టీ ఏమైంది ?
-దొంగ ఓట్ల ప్రచారం జోరందుకుంది
-సాకులు ఎతుక్కునే పనిలో వైసీపీ
తిరుపతి లో వైసీపీ గెలిచింది. ఆపార్టీ అభ్యర్థి గురుమూర్తి ,తన సమీప అభ్యర్థి తెలుగుదేశంకు చెందిన పనబాక లక్ష్మి పై విజయం సాధించారు. కానీ సత్తా చాటలేదు. ఇంత మెజార్టీ ,అంత మెజార్టీ అన్నారు. రికార్డు మెజార్టీ రాబోతుందని ఉదార గొట్టారు .ఎగ్జిట్ పోల్స్ లో కూడా 65 శాతం ఓటింగు అని ప్రచారం జరిగింది. టీడీపీ తో సహా మిగతా పార్టీలకు డిపాజిట్ లు రావనుకున్నారు. కేవలం 2 లక్షల 61 వేల మెజార్టీ మాత్రమే వచ్చింది. అక్కడ ఎన్నికల ఇంచార్జి గా వ్యవహరించిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మీడియా తో మాట్లాడుతూ ఓటింగ్ శాతం తగ్గినందున తమకు మెజార్టీ తగ్గిందని అన్నారు. టీడీపీ కి 2019 ఎన్నికలకన్నా ఓట్లు తక్కువచ్చాయని చెప్పుకొచ్చారు. తమ మెజార్టీ తగ్గడంపై ఆయన చెప్పిన మాటలు సమర్ధించుకునే విధంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ టీడీపీ గట్టి పోటికిచ్చింది. పోలింగు తగ్గినమాట నిజం అయినంత మాత్రాన తాము అనుకున్నంత మెజార్టీ రాకపోయాసరికి వైసీపీ నేతల తలలు పట్టుకున్నారు. వార్ వన్ సైడ్ అనుకున్నారు. మొత్తం ఓట్లు వైసీపీ వచ్చాయనే ధీమాతో వైసీపీ నేతలు ఉన్నారు.ఇతర ప్రాంతాలనుంచి ఓటర్లను తరలించి దొంగఓట్లు వేయించారనే అపవాదును సైతం మూటగట్టుకున్నారు. వృతం చెడ్డ ఫలితం తగ్గలేదు. దీంతో వైసీపీ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది .
previous post