Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బెడిసి కొట్టిన బీజేపీ వ్యూహం …బెంగాల్ లో దిదికే పట్టం

బెడిసి కొట్టిన బీజేపీ వ్యూహం …బెంగాల్ లో దిదికే పట్టం
-తమిళనాడు స్టాలిన్ దే… కేరళలో తిరుగులేని ఎల్ డి ఎఫ్
-అస్సోమ్ లో,పుదుచ్చేరి లలో బీజేపీ
-కొత్తగా దక్షిణాదిన పుదుచ్చేరి రావడంపై బీజేపీలో ఆనందం
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నకల ఫలితాలు వస్తున్నాయి. బెంగాల్ , తమిళనాడు , కేరళ , అస్సోమ్ ,పుదుచ్చేరి ఫలితాల ట్రెండ్ ను భట్టి ఒక్క బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే ఫలితాలు ఉన్నాయి. బెంగాల్ లో బీజేపీ వ్యూహం బెడిసి కొట్టింది. మమతా ను గద్దె దింపేందుకు బీజేపీ ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకున్నది. ప్రధాని మోడీ నరేంద్ర మోడీ.కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో పాటు కేంద్ర మంత్రులంతా బెంగాల్ పై కేంద్రీకరించారు. బెంగాల్ లో పాగా వేయబోతున్నట్లు చెప్పారు. మే 2 తరువాత బెంగాల్ ను పాలించేది బీజేపీ అని ప్రకటించారు. ఢిల్లీ పెత్తనానికి బెంగాల్ పౌరుషానికి మధ్య జరిగిన పోరులో బెంగాల్ పౌరుషమే గెలిచింది. బీజేపీ బెంగాల్ ను దక్కించు కోవడం కోసం తొక్కని అడ్డదార్లు లేవని. అన్ని రకాలుగా మమతా బెనర్జీ ని దిగ్బంధించి , అనేక మంది టీఎంసీ ఎమ్మెల్యేలను , ఎంపీ లను చివరకు కేబినెట్ మంత్రులను అడ్డగోలుగా చేర్చుకొని మతం ,ప్రాంతం , ముస్లిం కార్డు తో తీసినప్పటికి అవి ఏవి పని చేయలేదు. బెంగాల్ టైగర్ ను తానే అని ప్రకటించుకున్న మమతా వైపే బెంగాల్ ప్రజలు మొగ్గుచూపారు. ఘానా విజయం అందించారు. ఎం ఐ ఎం అధినేత అసదుద్దున్ ఒవైసి ముస్లిం ఓట్లు చీల్చి బీజేపీ కి లబ్ది చేకూర్చాలని పాచిక కూడా ఇక్కడ పారలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎం ఐ ఎం పోలిచేసిన 7 నియోజకవర్గాలలో ఓటమి చెందడం విశేషం . ఇక కాంగ్రెస్ , కమ్యూనిస్టులను ప్రజలు ఆదరించలేదు. టీఎంసీ , బీజేపీ పోర్టులు ఆకూటమిని పట్టించుకోలేదు. బెంగాల్ లో బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకట్టవేసేందుకు అక్కడ ప్రజలు దీదీ నే బెటర్ అని పూర్తిగా నమ్మారు. అందుకు తగ్గట్లుగానే అఖండ మెజార్టీ ఇచ్చారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు మరోసారి దేశానికి మార్గనిర్దేశం చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వస్తున్నా ట్రెండ్ ను బట్టి టీఎంసీ కి 210 సీట్లు వస్తున్నట్లు తెలుస్తుంది. మమతా నందిగ్రామ్ లో తన పార్టీ నుంచి బీజేపీ లో చేరిన సువెందు అధికారిపై విజయం సాధించారు. సువెందు స్థానికుడే కాకుండా అక్కడ మంచి పట్టున్న నాయకుడు .అంతకు ముందు మమతా కు కుడి భుజంగ పని చేశారు. సువెందు తండ్రి సైతం టీఎంసీ నుంచి ఎంపీగా ఎన్నికైయ్యారు.ఆయన తమ్ముడు మరో రాజకీయ నాయకుడు . అందరికి మమత అవకాశం కల్పించినప్పటికీ ఆమెను కాదని ద్రోహం చేసి బీజేపీ ప్రలోభాలకు లొంగి అందులో చేరారని ప్రజలు భావించారు. దీంతో ఆమె అక్కడ నుంచే పోటీచేసి సువెందు ను ఓడించాలనే పట్టుదలతో పోటికిదిగారు ఆమె ను ఆదరించిన నందిగ్రామ్ ప్రజలు గెలిపించారు.
తమిళనాడులో డీఎంకే తిరుగులేని ఆధిక్యం
తమిళనాడు ఎన్నికల్లో కూడా బీజేపీకి శృంగ భంగం తప్పలేదు. అక్కడ అన్నా డీఎంకే ద్వారా తమ అధికారాన్ని చలాయించవచ్చునన్న బీజేపీకి ఎదురు దెబ్బ తప్పలేదు . ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ దాదాపు నిజమైంది .153 సీట్లలో ఆధిక్యంలో ఉంది. పలువురు ప్రముఖులు ఇప్పటికే తమిళనాడు కు కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్ కు అభినందనలు వెల్లు ఎత్తుతున్నాయి. అన్నా డీఎంకే కేవలం 80 సీట్లకే పరిమితం కాబోతుంది.
కేరళ లో ఎల్ డి ఎఫ్ దే విజయం … రికార్డు సృష్టిచిన విజయన్
సిపిఎం నాయకత్వం లోని ఎల్ డి ఎఫ్ కేరళలో రెండవసారి విజయం సాధించింది. మొత్తం 140 సీట్లలో 100 కు పైగా ఎల్ డి ఎఫ్ ఆధిక్యంలో ఉంది.బీజేపీ పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. మెట్రో మెన్ శ్రీధరన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కేరళ ప్రజలు బీజేపీ రాజకీయాలను ఆదరించలేదు. శ్రీధరన్ సైతం ఓడిపోయారు. కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం అధికార మార్పిడి జరిగి తమకే అధికారం వస్తుందని అనుకున్నారు. కానీ ప్రతిపక్షానికే పరిమితం అయింది. రాహుల్ ,విస్తృత ప్రచారం జరిపిన ఫలితం లేకుండా పోయింది.
అస్సోమ్ అధికారాన్ని బీజేపీ తిరిగి నిలబెట్టుకోగా , పుదుచ్చేరిలో పాగా వేయడం బీజేపీ కి ఊరట నిచ్చే అంశంగా ఉంది.

Related posts

బీజేపీని మట్టి కరిపించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నాం: మల్లికార్జున ఖర్గే…!

Drukpadam

బండి సంజయ్ మిలీనియం మార్చ్ పై మండిపడ్డ హరీష్ రావు…

Drukpadam

సోము వీర్రాజును ఇకపై ‘సారాయి వీర్రాజు’ అని పిలవాలేమో…సీపీఐ రామకృష్ణ!

Drukpadam

Leave a Comment