Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళి అర్పించిన సీఎం జగన్!

ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళి అర్పించిన సీఎం జగన్!

  • మూడు రోజుల పర్యటన కోసం కడప వెళ్లిన ముఖ్యమంత్రి
  • నేడు పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో
     పాల్గొంటున్న జగన్
  • రేపు కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోనున్న సీఎం 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం ఇడుపులపాయలోని ఘాట్‌లో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి పులివెందుల వెళ్లి జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. విజయ హోమ్స్‌ దగ్గర ఉన్న జంక్షన్‌ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి మరిన్ని అభివృద్ధి పనుల కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు.

కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును, నూతన కూరగాయల మార్కెట్‌, మైత్రి లేఅవుట్‌లో వైఎస్సార్‌ స్మారక పార్కును ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాయలాపురం నూతన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. డాక్టర్‌ వైఎస్సార్‌ బస్‌ టర్మినల్‌ను ప్రారంభించి, బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ వెంటనే నాడు- నేడు ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం పాఠశాలను ప్రారంభించి తిరిగి ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆదివారం క్రిస్మస్‌ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

Related posts

5 Easy Tips On How To Plan A Balanced Diet For Glowing Skin

Drukpadam

ఈ సమయంలో దీనిపై మాట్లాడటం సరికాదు: వివేకా హత్యపై ఏపీ డీజీపీ!

Drukpadam

ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరుపై సీఐడీకి న్యాయమూర్తి ప్రశ్న

Ram Narayana

Leave a Comment