Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల పోస్ట్ మార్టం…

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల పోస్ట్ మార్టం…
-వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు సీట్లు
-ఖమ్మం కార్పొరేషన్ లో టీఆర్ యస్,సిపిఐ కూటమికి 92 వేల 327 ఓట్లు 45 డివిజన్లు
-టీఆర్ యస్ సిపిఐ ల ఓట్ల శాతం 54 .50
-కాంగ్రెస్ సిపిఎం కూటమికి 42 వేల 585 ఓట్లు 12 డివిజన్లు
-కాంగ్రెస్ సిపిఎం ఓట్ల శాతం 25 .13 శాతం
-బీజేపీ జెనసేన కూటమికి 12 వేల 523 ఓట్లు 1 డివిజన్
-బీజేపీ జనసేన ఓట్లశాతం 7 .52
-స్వతంత్రులు ,నోటా , 8 .18 శాతం
చెల్లని ఓట్లు 4 .67 శాతం
-సత్తా చాటిన టీఆర్ యస్ … పోరాడిన కాంగ్రెస్
-ఉనికి చాటుకున్న బీజేపీ
-పట్టు నిలుపుకున్న కమ్యూనిస్టులు

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి.పార్టీలు అన్ని పోస్ట్ మార్టం లో పడ్డాయి . అధికార టీఆర్ యస్ కార్పొరేషన్లో 2 /3 వ వంతు మెజార్టీ సాధించింది . ఓట్లు రీత్యా కూడా గణనీయమైన ఓట్లు సాధించింది. కార్పొరేషన్ లో 2 లక్షల 83 వేల 302 ఓట్లకుగాను , లక్ష 69 వేల 404 ఓట్లు పాలైయ్యాయి . అందులో అంటే 54 .50 శాతం టీఆర్ యస్ సిపిఐ కూటమికి , 25 .13 శాతం కాంగ్రెస్ ,సిపిఎం కూటమికి , 7 .52 శాతం బీజేపీ జనసేన కూటమికి ఓట్లు రాగ , 8 .18 శాతం స్వంతంత్రులు ,నోటాకు రాగ చల్లని ఓట్లు 4 .67 శాతం వరకు ఉన్నాయి. మొత్తం కార్పొరేషన్ లో 60 డివిజలకు గాను టీఆర్ యస్ సిపిఐలు కలిసి 92 వేల 321 ఓట్లు పొందాయి. 10 డివిజన్లో టీఆర్ యస్ ఏకగ్రీవం అయింది. దాని ఓట్లు కలపలేదు . కాంగ్రెస్ ,సిపిఎం కూటమి కి 42 వేల 585 ఓట్లు , బీజేపీ జనసేన కూటమికి 12 వేల 523 ఓట్లు వచ్చాయి.అంటే కాంగ్రెస్ సిపిఎం కూటమికన్నా టీఆర్ యస్ కూటమికి 49 వేల 425 ఓట్లు అధికారంగా వచ్చాయి. కాంగ్రెస్ సిపిఎం కూటమికి వచ్చిన ఓట్లకన్నా టీఆర్ యస్ సిపిఐ కూటమికి వచ్చిన మెజార్టీ ఎక్కువగా ఉండటం విశేషం. బీజేపీ జనసేన కూటమికి 12 వేల 740 ఓట్లు వచ్చాయి. టీఆర్ యస్ ముందునుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించింది.మంత్రి పువ్వాడ అజయ్ ముందుచూపు పనిచేసింది.అయితే కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. టీఆర్ యస్ , సిపిఐ కూటమికి మరో 7 లేదా 8 రావాల్సిఉంది. ప్రచారం కూడా అదే విధంగా జరిగింది.అసలు కారుకు 60 కి 60 అన్నారు. కానీ సిపిఐ తో కలిసి 45 తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంత్రి అంతా తానై నడిపించటాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేక పోయారు.పార్టీకి వ్యతిరేకంగా పనిచేయనప్పటికీ నేతలు ఓన్ చేసుకోలేదు. కొంత మందు నేతలు తమ అనుయాయిలకు టిక్కెట్లు ఇవ్వకపోవడంపై కీనకగా ఉన్నారు. చివరలో నాయకుల మధ్య సమన్వయానికి ప్రయత్నం జరిగినా, పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సిన డేమేజ్ జరిగింది . ఎంపీ ,మాజీ ఎంపీ , మాజీమంత్రి రంగంలోకి చివరిలో దిగారు.నామ కొంత ముందునుండే ప్రచారంలో ఉన్న కారణాలు ఏమైనా మొత్తం ప్రచారంలో లేరు. కొన్ని డివిజన్లలో అభ్యర్థుల ఎంపికలో లోపాలు ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలు సాదించామనే ఆత్మ సంతృప్తి మిగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ లు ఖమ్మం ఫలితాలపై మంత్రి పువ్వాడను అభినందించారు. ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా మరోసారి ఎగిరింది.
ఇక కాంగ్రెస్ కు ఖమ్మం లో దిక్కు దివానం లేదు . గత ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ పొత్తుల ఎత్తుల్లో భాగంగా టీడీపీ కు సీటు వదిలారు.కాంగ్రెస్ పోటీచేయలేదు. దీంతో కాంగ్రెస్ కు నాయకుడు లేరు . పైగా నియోజకవర్గాన్ని ఓన్ చేసుకునే నాధుడు లేడు. అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కూడా లేరు.ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నా ఆయనకు ఖమ్మం మీద పెద్ద పట్టులేదు.ఇక నగర కాంగ్రెస్ అధ్యక్షుడుకి మొత్తం ఖమ్మం మీద పట్టుకలిగి లేరు.మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు ఉన్నా, మొత్తం భాద్యత తీసుకునేందుకు సిద్ధపడలేదు . ఖమ్మం జిల్లా అంతా సీఎల్పీ నేత భట్టి కనుసన్నల్లో నడుస్తుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. కొంత సమన్వయం చేసి భాద్యత తీసుకున్నారు. అదికూడా చివరలో వచ్చారు ,నగరంలో విస్తుతంగా పర్యటించారు . ఇక్కడ వివిధ పార్టీలతో కలిసి పోటీచేసేందుకు కృషి చేశారు.చివరకు సిపిఎంతో పొత్తు కుదిరి కలిసి రంగంలోకి దిగారు.కాంగ్రెస్ కు వస్తే గిస్తే 5 లేదా 6 సీట్లు వస్తాయని పరిశీలకుల అభిప్రాయంగా ఉండే కాని 10 డివిజన్లు గెలవగలిగింది. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు టీఆర్ యస్ కు ఢీఅంటే ఢీ అనే విధంగా ఉంది . ఎమ్మెల్యేగా గెలిచి అప్పటికి కొద్దీ కాలమే అయింది . కాంగ్రెస్ మంచి అసెట్ గా అజయ్ ఉన్నారు. అయినప్పటికీ 10 డివిజన్లలో మాత్రమే గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ కు నా అనే నాయకుడు లేకపోయినా 10 డివిజన్లలో గెలవడం పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మేము ఉన్నాం మాకు టిక్కెట్ ఇవ్వండి అనే వచ్చే వారు ఉంటారు కాని కార్యకర్తల మంచి చెడు పట్టించుకువడం వైఫల్యాలు ఉన్నాయి. జనంలో ఉన్నవారిని నాయకుడుగా గుర్తిస్తారనే విషయాన్నీ చాలామంది నేతలు పక్కన పెట్టారు. ఎన్నికల నాటికీ నోట్లు పెట్టి ఓట్లు కొనుగోలు చేద్దామనే ధోరణితో కనిపిస్తుంది . ఖమ్మం కార్పొరేషన్ లో కాంగ్రెస్ కు 10 డివిజన్లు వచ్చాయి. వారిని నడిపించే నాయకుడు కావాలి .లేకపోతె గతంలో లాగానే మల్లి చాలామంది అధికార పార్టీలో చేరే అవకాశముంది. అదే జరిగితే పార్టీ తప్పిదంగానే ఉంటుంది.
బీజేపీ జనసేన కూటమి కొత్తగా వచ్చింది. ఖమ్మం పురపాలన చరిత్రలో ఇంతవరకు ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ బోణి కొట్టడం విశేషం . దీనికోసం బండి సంజయ్ , కేంద్ర మాజీమంత్రి పురందరేశ్వరి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , తదితరులు ప్రచారంలో పాల్గిన్నారు. కాని ఒక్క డివిజన్లో మాత్రమే గెలిచారు. అదికూడా గెలిచిన కార్పొరేటర్ వ్యక్తిగత గెలుపుగానే భావిస్తున్నారు. అయితే రెండు పార్టీలకు కలిపి 12 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లు కూడా ఇద్దరు గెలిచి సత్తాచాటారు.

 

Related posts

ఢిల్లీలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర!

Drukpadam

మంత్రి రోజాకు అండగా నటి రాధిక.. టీడీపీ నేత బండారుపై ఫైర్

Ram Narayana

ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయి…చర్యలు తీసుకోండి రాష్ట్రపతి ,ప్రధానికి చంద్రబాబు లేఖ …

Ram Narayana

Leave a Comment