Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల సమస్యలపై వ్య .కా రాష్ట్ర సభల్లో తీర్మానం చేసినందుకు ధన్యవాదాలు .. .టి యూ డబ్ల్యూ జే (ఐజేయూ )

జర్నలిస్టుల సమస్యలపై వ్య .కా రాష్ట్ర సభల్లో తీర్మానం చేసినందుకు ధన్యవాదాలు ..
.టి యూ డబ్ల్యూ జే (ఐజేయూ )

ఖమ్మంలో మూడు రోజులపాటు జరిగిన వ్యవసాయకార్మిక సంఘం మూడవ రాష్ట్ర మహాసభల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తీర్మానం చేసినందుకు ఆ సంఘానికి ,సంఘనాయకులకు టి యూ డబ్ల్యూ జే (ఐజేయూ ) తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె . రాంనారాయణ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు , ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు , నగర టీయూడబ్ల్యూజే అధ్యక్షులు మైసా పాపారావు ,కార్యదర్శి శ్రీనివాస్ లు ఒక ప్రకటనలో తెలిపారు . జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కోసం గత 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడుతున్నామని అయనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాగ్దానాలు అమలు చేయకపోవడంపై ప్రభుత్వంకు తమ గోడు వినిపించేందుకు చేసిన ప్రయత్నాలకు స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు . జర్నలిస్టులకు ఇల్లు ,ఇళ్ల స్థలాలు కావాలని అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేశామని ఆయనప్పటికీ వాటిని పెడచెవినపెట్టిన ప్రభుత్వం జర్నలిస్టుల కోరికలు తీర్చకపోవడం బాధాకరమని అన్నారు .జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ,అక్క్రిడేషన్లు ఇచ్చి ముఖ్యమంత్రి తమ సమస్యల పరిష్కరానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు .

Related posts

ప్రజాగ్రహం ముందు ఏదీ పనిచేయదు…

Drukpadam

చీమలపాడు దుర్ఘటన అత్యంత దురదృష్టకరం: పవన్ కల్యాణ్

Drukpadam

తమ్ముడి మృతితో బాధపడుతున్న చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఫోన్

Ram Narayana

Leave a Comment