Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ దన్ను…

ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ దన్ను…
– ప్రధానిని తనమాటలు వినిపించుకోలేదని జార్ఖండ్ సీఎం అసంతృప్తి
-ఇలాంటి రాజకీయాలు వద్దన్న ఏపీ సీఎం జగన్
ప్రధానికి మనమంతా మద్దతు ఇవ్వాలని హితవు
ప్రధాని మోదీ తనతో మాట్లాడారన్న ఝార్ఖండ్ సీఎం
తాను చెప్పేది వినిపించుకోలేదన్న హేమంత్ సొరేన్
ట్విట్టర్ లో స్పందించిన ఏపీ సీఎం జగన్
విభేదాలను పక్కనబెట్టాలని సూచన
కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపు
కరోనా కష్టకాలంలో రాజకీయాలు తగదు . అవి మనదేశాన్ని బలహీన పరుస్తాయి.ప్రస్తుత తరుణంలో మనమంతా ప్రధాని మోడీకి ఎన్నుదన్నుగా ఉండాలి . మానమద్దతే ఆయనకు కొండంత బలం .మరింత పట్టుదలతో పనిచేయగలరు. అందుకు మానమద్దతు అవసరం అని ఏపీ సీఎం జగన్ ట్వీటర్ లో జార్ఖండ్ సీఎం సొరేన్ కు హితబోధచేశారు. ఇది జగన్ పరిపక్వతకు నిదర్శనమని రాజకీయపండితులు అంటున్నారు. ఇప్పటికే దేశం అతర్జాతీయస్థాయిలో అపఖ్యాతి పాలైన నేపథ్యంలో జగన్ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
నిన్న ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కాస్త అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు చేశారు. గౌరవనీయ ప్రధానమంత్రి తనతో మాట్లాడారని, కానీ ఆయన ఏమనుకుంటున్నారో అదే చెప్పారు తప్ప, తన మాటలేవీ ఆయన వినిపించుకోలేదని సోరేన్ వాపోయారు. కరోనా కష్టకాలంలో ఏంచేయాలో దాని గురించి మాట్లాడితే బాగుండేదని, తాము తీసుకుంటున్న చర్యల గురించి వింటే సంతృప్తికరంగా ఉండేదన్నారు. అయితే, ఊహించని విధంగా హేమంత్ సొరేన్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ ట్వీట్ ద్వారా స్పందించారు.

“డియర్ హేమంత్ సొరేన్… మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ ఓ సోదరుడిగా మిమ్మల్ని కోరేదేమిటంటే… మనమధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో విమర్శనాత్మక రాజకీయాలు సరికాదు. అవి దేశాన్ని మరింత బలహీనపరుస్తాయి. కొవిడ్-19కు వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధంలో ఒకరిని వేలెత్తి చూపేందుకు ఇది తగిన సమయం కాదు. అందరం కలిసికట్టుగా ముందుకొచ్చి ప్రధాని మోదీకి మరింత మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది. మనందరం మోదీకి సంఘీభావం ప్రకటిస్తే ఆయన కరోనా మహమ్మారిపై మరింత సమర్థంగా యుద్ధం చేయగలరు” అని సీఎం జగన్ హితవు పలికారు.

Related posts

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ;ఉత్తమ్!

Drukpadam

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద పడి ఏడుస్తున్నారు: అంబటి!

Drukpadam

వార్తలలో వ్యక్తి కృష్ణపట్నం ఆనందయ్య …..

Drukpadam

Leave a Comment