Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్ఎస్ యుఐ వెంకట్ అరెస్టును ఖండించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క!

ఎన్ఎస్ యుఐ వెంకట్ అరెస్టును ఖండించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క!
-ఏం నేరం చేశారని అరెస్టు చేశారని పోలీసులపై ఆగ్రహం
-భేషరతుగా విడిచిపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన భట్టి -విక్రమార్కప్రజాస్వామ్య పద్ధతిలో గాంధేయ మార్గంలో
-ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మద్దతుగా
-గాంధీభవన్ లో దీక్ష చేస్తున్న ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ -తో పాటు ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల దీక్షను భగ్నం చేసి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని
-సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. బుధవారం -మధ్యరాత్రి గాంధీభవన్లోకి చొరబడి పోలీసులు

ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ను బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించి అక్కడి నుంచి మధ్యాహ్నం బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి రాత్రి వరకు కూడా విడిచిపెట్టకపోవడం పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి నేరం చేశాడని వెంకట్ ను అరెస్టు చేశారని పోలీసులను ప్రశ్నించారు. రన్నింగ్ లో క్వాలిఫై అయిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల అందరికీ మెయిన్స్ లో అవకాశం కల్పించాలని శాంతియుతంగా గాంధీభవన్లో దీక్ష చేయడం ఏమైనా నేరమా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అరెస్టు చేసిన అభ్యర్థులను ఉదయమే విడిచిపెట్టిన పోలీసులు వెంకట్ ను మాత్రం రాత్రి వరకు ఎందుకు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారో సమాధానం చెప్పాలన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన వెంకట్ ను వెంటనే పోలీసులు బేరషత్తుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే హక్కును సైతం ప్రభుత్వాలు కాలరాయడం తగదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తున్న పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే స్పందించి వెంకట్ కు ఫోన్ చేసి భట్టి విక్రమార్క పరామర్శించారు. పోలీసుల అక్రమంగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న వివరాల గురించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు వెంకట్ వివరించారు.
పోలీసు ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు.

Related posts

కేసీఆర్ నాందేడ్ సభకుమిత్రులను ఎందుకు పిలవలేదు …?

Drukpadam

తెలంగాణలో అమిత్ షా ఆపరేషన్ …ఈనెల 15 ఖమ్మంలో సభ …!

Drukpadam

సీఎం జగన్ సింహం లాంటి వాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ధర్మాన కృష్ణదాస్!

Drukpadam

Leave a Comment