ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు: పోలీస్ కమిషనర్
-పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు మంచినిర్ణయం
-అందులో ఉండే పోలీసులు వ్యవహారాన్ని బట్టే శాఖకు పేరు వస్తుంది
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే కొవిడ్ అనుమానితులు, బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు ఖమ్మం పోలీసుల ఆధ్వర్యంలో వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రి ఆవరణలో ‘కొవిడ్-19 హెల్ప్ డెస్క్’ను సిద్ధం చేశారు. శనివారం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ చేతుల మీదుగా హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు.
ఈ హెల్ప్ డెస్క్‌లో పోలీస్ కానిస్టేబుళ్లు, మెడికల్ సిబ్బంది విధుల్లో ఉంటారు. ఆసుపత్రిలోని వివిధ వార్డుల గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చునని పోలీస్ కమిషనర్ చెప్పారు. పగలు, రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తగిన మార్గదర్శనం చేస్తారని వివరించారు. కరోనా వైరస్ అతివేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్న కొవిడ్ రోగులు సాయం కోసం ఎవర్ని అభ్యర్థించాలో తెలియని పరిస్థితులలో ఆందోళన చెందకుండా…. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు మేమున్నామనే భరోసా కల్పించాలని కోవిడ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ పెర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో కరోనా వైరస్ కట్టడి కోసం అలుపెరుగక పోరాటం చేస్తున్న పోలీసు సిబ్బంది కరోనా బారిన పడితే..తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, ఇంకా మెరుగైన వైద్యం అవసరమనుకుంటే..అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు స్వయ నియంత్రణ పాటిస్తూ..
మాస్క్ లు తప్పనిసరిగా ధరించి కొవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకారించాలని సూచించారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నిర్ణయం పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతుంది. పోలీస్ శాఖ నిత్యం క్రైమ్ వ్యవహాలు కాకుండా ప్రజలకు సహాయం చేసే చర్యలు చేపట్టడం అందులో కోవిద్ మహమ్మారి నేపథ్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుకు కమిషనర్ నిర్ణయం తీసుకోవడం పట్ల సానుకూలత వ్యక్తం అవుతుంది. అయితే అక్కడ డ్యూటీలో ఉండే సిబ్బంది అందించే సేవలపై ఆధారపడి శాఖ కు పేరువస్తుంది
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , హాస్పిటల్ సూపరిండెండ్ B.వేంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్ , ఖమ్మం టూ టౌన్ సిఐ కరుణకర్, ఆర్బన్ సిఐ వెంకన్న బాబు పాల్గొన్నారు.