Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బీహార్ లో గంగానదిలో తేలిన 100 కరోనా మృతదేహాలు…

100 corona dead bodies floated in Ganges river in Bihar
బీహార్ లో గంగానదిలో తేలిన 100 కరోనా మృతదేహాలు
  • బక్సర్ జిల్లా మహదేవ్ ఘాట్ వద్ద తేలిన శవాలు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు,వీడియోలు
  • ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చాయన్న బీహార్ అధికారి
గంగానదిలో ఏకంగా 100 కరోనా మృతదేహాలు తేలడం బీహార్ లో కలకలం రేపుతోంది. బక్సర్ జిల్లాలోని మహదేవ్ ఘాట్ వద్ద ఈ శవాలు నీటిపై తేలుతూ కనిపించాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ శవాలు బీహార్ కు చెందినవి కాదని… తాము ఆరా తీయగా ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చాయని తేలిందని బక్సర్ జిల్లా అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, మహదేవ్ ఘాట్ కు 40 నుంచి 45 వరకు శవాలు కొట్టుకొచ్చాయని చెప్పారు. తమ ప్రాంతంలో ఎవరైనా కరోనాతో మరణిస్తే దహనం చేస్తున్నామని… కాపలాదారులను పెట్టి మరీ దహన ప్రక్రియను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ శవాలు ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకు వచ్చి ఉంటాయని చెప్పారు. నదిలో డెడ్ బాడీలను అడ్డుకునే మార్గం లేకపోవడంతో ఇక్కడి వరకు కొట్టుకొచ్చాయని అన్నారు.

Related posts

మేడారం జాతర సమీక్షలో గాయత్రి రవి!

Drukpadam

ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యులుగా ట్రాన్స్‌జెండర్లు!

Drukpadam

ఖమ్మంలో ఎంపీలు నామ,వద్దిరాజు,ఎమ్మెల్సీ తాతా మధుల పర్యటన….

Drukpadam

Leave a Comment