Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

18 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వీరే!

18 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వీరే!

  • స్థానిక, ఎమ్మెల్యే, గవర్నర్ కోటాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
  • బీసీలకు 11 స్థానాలతో పెద్ద పీట వేసిన జగన్
  • ఎస్సీలకు 2.. ఎస్టీలకు 1 స్థానం

ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటే విన్నాం కానీ ఒకే దెబ్బకు 18 పిట్టలు ఇప్పుడు చూస్తున్నాం …ఏపీ రాజకీయాల్లో కొద్దిరోజుల క్రితం వరకు శాననమండలిలో తమకు తిరుగులేని ఆధిక్యతను కనబరిచిన టీడీపీ ఇప్పడు జీరో అవుతుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. రేపు మే నాటికీ ఇద్దరు ముగ్గురు మినహా టీడీపీ సభ్యులు అందరు రిటైర్ కాబోతున్నారు . నాడు తమకున్న బలంతో మూడు రాజధానుల బిల్లును మండలిలో అడ్డుకున్న టీడీపీ నేడు కనీసం మాట్లాడే పరిస్థితిలో లేదు .అందుకే అంటారు ఓడలు బండ్లు …బండ్లు ఓడలు అవుతాయని ..అయితే ఎవరికైనా ఇదే వర్తిస్తుంది అనేది అందరు తెలుసుకుంటే మంచిది . మార్చ్, ఏప్రిల్ , మే నెలలో రిటైర్ కానున్న 18 మంది సభ్యుల్లో దాదాపు అందరు టీడీపీవారే ఉన్నారు . స్థానిక సంస్థల కోటాలో లేదా ఎమ్మెల్యే కోటాలో ,గవర్నర్ కోటాలో కూడా వైసీపీ కే అవకాశాలు ఉండటంతో వారి సభ్యులను పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ ఆమోదం మేరకు సలహాదారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి సోమవారం ప్రకటించారు .

 

ఏపీలో స్థానిక, ఎమ్మెల్యే, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. స్థానిక కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లను ప్రకటించారు. మొత్తం స్థానాల్లో బీసీలకు 11, ఓసీలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్ధానాన్ని కేటాయించారు. 

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా:

స్థానిక సంస్థల కోటా:

  • ఎస్. మంగమ్మ – అనంతపురం. బీసీ. బోయ
  • డాక్టర్ మధుసూదన్ – కర్నూలు. బీసీ. బోయ
  • రామసుబ్బారెడ్డి – కడప. ఓసీ. రెడ్డి
  • డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం – చిత్తూరు. బీసీ. వెన్నెరెడ్డి
  • మేరుగ మురళీధర్ – నెల్లూరు. ఎస్సీ. మాల
  • కావూరు శ్రీనివాస్ – పశ్చిమగోదావరి. బీసీ. శెట్టిబలిజ
  • వంకా రవీంద్రనాథ్ – పశ్చిమగోదావరి. ఓసీ. కాపు
  • కుడిపూడి సూర్యనారాయణ – తూర్పుగోదావరి. బీసీ. శెట్టిబలిజ
  • సత్తు రామారావు – శ్రీకాకుళం. బీసీ. యాదవ

ఎమ్మెల్యే కోటా:

  • ఏసురత్నం – గుంటూరు. బీసీ. వడ్డెర
  • మర్రి రాజశేఖర్ – గుంటూరు. ఓసీ. కమ్మ
  • జయమంగళ వెంకటరమణ – పశ్చిమగోదావరి. బీసీ. వడ్డెర
  • బొమ్మి ఇజ్రాయిల్ – తూర్పుగోదావరి. ఎస్సీ. మాదిగ
  • కోలా గురువులు – విశాఖ. బీసీ. వడబలిజ
  • పోతుల సునీత – ప్రకాశం. బీసీ. పద్మశాలి
  • పెన్మత్స సూర్యనారాయణ రాజు – విజయనగరం. ఓసీ. క్షత్రియ. 

గవర్నర్ కోటా:

  • కర్రి పద్మశ్రీ – కాకినాడ. బీసీ. మత్స్యకార
  • కుంభా రవి – అల్లూరి జిల్లా. ఎస్టీ. ఎరుకుల

Related posts

బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొడతారా ?

Drukpadam

బందరుకు పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు..సీఎం జగన్

Drukpadam

ఇంతకీ హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆమేనా ?

Drukpadam

Leave a Comment