Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వివేకా హత్య కేసులో తనను ఇరికించే ప్రయత్నం ;ఎంపీ అవినాష్ అనుమానం …

దస్తగిరి అక్కడా ఇక్కడా విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ జరుపుతోంది: అవినాశ్ రెడ్డి

  • వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ
  • తనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవన్న అవినాశ్ 
  • తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడి
  • విచారణ అధికారి పక్షపాత ధోరణి కనబర్చుతున్నారని ఆరోపణ

వివేకా హత్య కేసు నేపథ్యంలో, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇవాళ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదని తెలిపారు. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. దస్తగిరి అక్కడా ఇక్కడా విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోందని అవినాశ్ రెడ్డి విమర్శించారు.

తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ, ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాత ధోరణితో కూడుకుని ఉందని ఆరోపించారు. వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకుని, అదే కోణంలో విచారణ జరుపుతున్నారని అవినాశ్ రెడ్డి విమర్శించారు.

తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణ అధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని వెల్లడించారు.

వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ అవినాశ్ రెడ్డిa

  • వివేకా హత్య కేసులో అవినాశ్ ను ప్రశ్నిస్తున్న సీబీఐ
  • రేపు మరోసారి విచారణ
  • న్యాయవాదిని అనుమతించాలంటూ అవినాశ్ పిటిషన్
  • ఆడియో, వీడియో రికార్డింగ్ కు ఆదేశించాలని విజ్ఞప్తి
  • సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని వినతి
MP Avinash Reddy files petition on Telangana High Court
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే రెండు దఫాలు విచారించింది. మరో విడత విచారణకు ఈ నెల 6న రావాలంటూ నోటీసులు పంపగా, తనకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని అవినాశ్ రెడ్డి బదులిచ్చారు. దాంతో సీబీఐ ఈ నెల 10న రావాలంటూ మళ్లీ నోటీసులు పంపింది. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి రేపు హైదరాబాదులో సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.

అయితే, ఈ విషయంలో అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు న్యాయవాదిని కూడా అనుమతించాలని… విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

అంతేకాదు, తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం కాపీని ఇచ్చేలా ఆదేశించాలని కూడా తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.

Related posts

తెలంగాణ కాంగ్రెస్ లో హనుమంతుడి లొల్లి…

Drukpadam

సాగర్ లో పోటీకి విజయశాంతి సై అంటారా ?

Drukpadam

ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి జై కొట్టిన జగన్!

Drukpadam

Leave a Comment