Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నరాలు తెగే ఉత్కంఠ మధ్య కవిత 8 గంటల పాటు విచారించిన ఈడీ…

నరాలు తెగే ఉత్కంఠ మధ్య కవిత ను విచారించిన ఈడీ…
తిరిగి ఈనెల 16 న విచారణకు హాజరు కావాలని నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం… ముగిసిన కవిత విచారణ…

  • లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
  • ఈడీ నోటీసుల జారీ
  • విచారణకు హాజరైన కవిత
  • 8 గంటలకు పైగా విచారణ
  • ఈ నెల 16న మరోసారి విచారించనున్న ఈడీ

.

తెలంగాణ సీఎం కుమార్తె బీఆర్ యస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు లిక్కర్ స్కాం కేసులో ఈడీ ముందు విచారణకు హాజరైయ్యారు . లోపల ఏమి జరుగుతుందో తెలియదుగాని నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ విచారణ ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగింది .లోపల విచారణ జరుగుతుండగా బయట బీఆర్ యస్ కార్యకర్తల ఆందోళనల మధ్య సాగిన విచారణపై మీడియా మొత్తం ద్రుష్టి సారించడంతో ఆసక్తిపెరిగింది . చివరకు రాత్రి 8 గంటల 5 నిమిషాలకు ఈడీ కార్యాలయం నుంచి కారులో పూర్తి పోలీస్ భద్రతా మధ్య కవిత బయటకు రావడంతో బీఆర్ యస్ నాయకులూ కార్యకర్తలు ఊపిరి పీల్చుకొని సంతోషం వ్యక్తం చేశారు . అయితే తిరిగి 16 విచారణ కు హాజరు కావాలని ఈడీ అధికారుల నోటీసులు మరల అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే విచారణ ముగియగానే కవిత వెంటనే తన సోదరుడు కేటీఆర్ , భావ హరీష్ రావు తో భర్త , ఇతర టీఆర్ యస్ నాయకులతో కలిసి హైద్రాబాద్ బయలుదేరి వచ్చారు .

ఈడీ అధికారులు కవితను 8 గంటలకు పైగా ప్రశ్నించారు. కాగా, కవితను మరోసారి ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు అందించింది. విచారణ ముగిసిన అనంతరం కవిత… ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి బయల్దేరారు.

కాగా, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల నుంచి ఆయన ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారు. కవితపై ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రులు,’ఎంపీలు , పలువురు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు , ఇతర నాయకులూ దేశ రాజధానిలో మకాం విశేషం .

 

Related posts

Why Bold Socks Are The ‘Gateway Drug’ To Better Men’s Fashion

Drukpadam

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ జయభేరి… బీజేపీ 15 ఏళ్ల పాలనకు ముగింపు!

Drukpadam

శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష…

Drukpadam

Leave a Comment