Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఇతర సంస్థలను ఆహ్వానించడానికి భారత్ బయోటెక్ ఓకే :నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్…

ఇతర సంస్థలను ఆహ్వానించడానికి భారత్ బయోటెక్ ఓకే :నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్
-ఢిల్లీలో నేడు కేంద్రం మీడియా సమావేశం
-కొవాగ్జిన్ తయారీని ఇతర సంస్థలకూ అప్పగించాలని డిమాండ్లు
-స్వాగతించిన భారత్ బయోటెక్
-కొవాగ్జిన్ తయారీకి బీఎస్ఎల్-3 ల్యాబ్ లు ఉండాలన్న వీకే పాల్
నీతి ఆయోగ్ సభ్యుడు, కేంద్రం నిపుణుల కమిటీ చీఫ్ డాక్టర్ వీకే పాల్ ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా పరిజ్ఞానాన్ని ఇతర కంపెనీలకు బదలాయించాలన్న డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. ఈ ప్రతిపాదలను భారత్ బయోటెక్ కూడా స్వాగతిస్తోందని అన్నారు.

అయితే, సజీవంగా ఉన్న కరోనా వైరస్ ను అచేతనంగా మార్చడం ద్వారా కొవాగ్జిన్ తయారుచేస్తారని, ఈ ప్రక్రియను కేవలం బీఎస్ఎల్-3 ప్రమాణాలు కలిగిన ల్యాబ్ లు మాత్రమే చేయగలవని స్పష్టం చేశారు. ఇతర సంస్థలకు ఇది సాధ్యం కాకపోవచ్చని వీకే పాల్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియ ద్వారా కొవాగ్జిన్ టీకా తయారుచేయగలం అని భావించే కంపెనీలు ముందుకు రావొచ్చని తెలిపారు.

కొవాగ్జిన్ పై కేంద్రం ఆఫర్ ను అంగీకరించే సంస్థలు కలసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందని, కేంద్రం నుంచి కూడా సహకారం ఉంటుందని, తద్వారా వ్యాక్సిన్ ఉత్పాదకత మరింత పెరుగుతుందని వివరించారు.

Related posts

లాక్ డౌన్ దిశగా భారత్ …న్యూ ఇయర్ వేడుకలు లేనట్లే…?

Drukpadam

కరోనా లాక్‌డౌన్ ఎత్తేయాలంటూ ఆస్ట్రేలియాలో రోడ్డెక్కిన ప్రజలు..

Drukpadam

కరోనా మహమ్మారి అంతమవుతుందని అనుకోవద్దు.. మరిన్ని వేరియంట్లు పుడతాయి: డబ్ల్యూహెచ్ వో

Drukpadam

Leave a Comment