Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల కేసీఆర్ సర్కారుపై ఒంటరి పోరాటం …

నాపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

షర్మిల కేసీఆర్ సర్కారుపై ఒంటరి పోరాటం …

  • ప్రశ్నాపత్రాల లీక్ కేసులో సిట్ పెద్ద తలకాయలను వదిలేస్తోందన్న షర్మిల
  • తాను నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నానని వెల్లడి
  • తనకు లుకౌట్ నోటీసులు ఇచ్చారంటూ ఆగ్రహం
  • ఇంతకంటే చేతకాని ముఖ్యమంత్రి ఇంకెవరుంటారని విమర్శలు

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కేసీఆర్ సర్కారుపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆమె పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎదో ఒక సమస్యపై ప్రజల్లో ఉంటున్నారు . మొదట్లో ఆమె ఎవరు వదిలిన బాణం అనే చర్చ నడిచింది . కాళేశ్వరంలో అవినీతి, నిరుద్యోగులకు ఉద్యోగాలు , అవినీతి అక్రమాలపై గళం విప్పుతున్నారు . పాదయాత్రల ద్వారా రాష్ట్రమంతా పర్యటిస్తున్న ఆమె ఆయన నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులపై విమర్శలు గుప్పిస్తున్నారు . అది నచ్చని నాయకులు ఆమెపై దాడులకు సైతం వెనకాడటంలేదు . అటు వనపర్తి , ఇటు నర్సంపేట , మహబూబాబాద్ , వరకు ఆమెపై బీఆర్ యస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు . అయనప్పటికీ ఆమె తన రాజకీయ పోరాటాన్ని కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆమెకు ఎవరి మద్దతు లేదు . అయితే ఆమె పై నర్సంపేట వద్ద దాడిజరిగి హైద్రాబాద్ లో దెబ్బతిన్న వాహనాన్ని సీఎం నివాసం ప్రగతిభవనంకు స్వయంగా నడుపుకుంటూ వెళుతున్న సందర్భంలో క్రైన్ సహాయంతో ఆమెను వాహనంలోనే ఉంచి లాక్కుని పోయిన దృశ్యాలను చుసిన ప్రధాని మోడీ ఫోన్ చేసి పరామర్శించారు . గవర్నర్ దగ్గరకు వెళ్లి రాష్ట్రంలో తనకు జరుగుతున్న దాడులపై మోర పెట్టుకున్నారు . కాంగ్రెస్ లోని కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఖండించారు . రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తారా ..? లేక ఏదైనా పార్టీతో కలుస్తారా …? అనేది చూడాలి .. ఇప్పుడు పేపర్ లీకేజి సమస్యపై టీఎస్ పీఎస్సీ కార్యాలన్నీ ముట్టడించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమెపై లుక్ అవుట్ నోటీసులు జారీచేయడం ఆసక్తిగా మారింది … ఆయన ఆమె టీఎస్ పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు .

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ దుమారం కొనసాగుతోంది. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల కుంభకోణంలో సిట్ పెద్ద తలకాయలను వదిలేస్తోందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న తనపై లుకౌట్ నోటీసులు ఇచ్చారని, కేసీఆర్ నియంత పాలనకు ఇది నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే తనను రెండుసార్లు గృహ నిర్బంధం చేశారని, ఇప్పుడు దుర్మార్గంగా లుకౌట్ నోటీసులు ఇచ్చి, పోలీసులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.

“టీఎస్ పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకైన విషయంలో కేసీఆర్ ఒక సిట్ వేశారు. ఈ స్కాంలో పెద్దవాళ్ల ప్రమేయం ఏదీ లేదని, ఇందులో ఉన్నవాళ్లంతా చిన్నవాళ్లేనంటూ సిట్ ద్వారా చెప్పించి, ఈ కేసును సులువుగా ముగించే ప్రయత్నం చేస్తున్నారని మాకు తెలిసింది. అందుకే టీఎస్ పీఎస్సీని ముట్టడి చేయాలని వైఎస్సార్టీపీ నిర్ణయించింది. దాంతో నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో నేను ఎలాగోలా బయటపడి ఒక హోటల్ రూంలో రాత్రంతా ఉన్నాను. ఇవాళ టీఎస్ పీఎస్సీని ముట్టడించాలని నిర్ణయించుకుంటే, నా కోసం ఒక లుకౌట్ ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది.

నేనేమైనా క్రిమినల్ నా? నేనేమైనా తప్పు చేశానా? పేపర్ లీక్ చేసింది ఎవరు? పోలీసులకు ఇంకేమీ పనిలేనట్టుగా నా ఆఫీసు చుట్టూ మోహరించారు. పోలీసు బలగాలు ఉండాల్సింది ఎక్కడ? మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? నాపై లుకౌట్ నోటీసు ఇచ్చారంటే ఇంతకంటే చేతకాని ముఖ్యమంత్రి ఇంకెక్కడైనా ఉంటారా?

మీరు మాత్రం ఎంతైనా అవినీతి చేసుకోవచ్చు… కాళేశ్వరంలో స్కాం చేసుకోవచ్చు… మీ బిడ్డలు స్కాంలు చేసుకోవచ్చు… మీ వాళ్లందరూ క్వశ్చన్ పేపర్లు లీక్ చేసుకోవచ్చు… దళిత బంధు మీ అనుచరులకే ఇవ్వొచ్చు… డబుల్ బెడ్రూం ఇళ్లు బీఆర్ఎస్ పార్టీ వాళ్లకే ఇవ్వొచ్చు… ఇలా మీరు మాత్రం ఎన్ని అక్రమాలకైనా పాల్పడతారు… పోలీసులను మీ రక్షణ కోసం వాడుకుంటారు” అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.

Related posts

జడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన అధికార పార్టీ జడ్పీటీసీలు!

Drukpadam

నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు టీడీపీవే.. లోకేశ్ పాదయాత్ర ఒక ప్రభంజనం: కోటంరెడ్డి

Drukpadam

నా రాజకీయ జీవితంలో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత చూడలేదు… చంద్రబాబు

Drukpadam

Leave a Comment