-ఐ ఎం ఎ ఖమ్మం టెలిమెడిసిన్
-అందుబాటులో 31 మందిడాక్టర్లు
-లాక్ డౌన్ సమయంలో తమవంతు సహకారం -అందించేందుకు ముందుకు వచ్చిన డాక్టర్లు. -అభినందించిన మంత్రి, కలెక్టర్
ప్రస్తుతం జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు మరియు రాష్ట్రవ్యాప్తంగా వున్న లాక్ డౌన్ వల్ల కోవిడ్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలకోసం నిత్యం ఆసుపత్రులకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా వుండేందుకు IMA ఖమ్మం వారి ఆద్వర్యంలో టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వివిధ బ్రాంచిలకు సంబంధించిన దాదాపు 31మంది వైద్యులు జిల్లా ప్రజలకు వివిధ సమయాలలో అందుబాటులో వుంటారు. ఈ సేవలను వినియోగించుకోవలసిందిగా ప్రజలను IMA బాధ్యులు కోరారు. లాక్ డౌన్ సమయంలో స్వచ్ఛందంగా సేవలను అందించడానికి ముందుకు వచ్చిన వైద్యులను,IMA ఖమ్మం వారిని ఈ సంధర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ కర్నన్ , DMHO Dr. మాలతి పలువురు అభినందించారు.