Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి ఆర్థిక అరాచకాలు , భూకబ్జాలపై సీబీ సిఐడి విచారణ జరపాలి …తాతా మధు డిమాండ్ …

పొంగులేటి ఆర్థిక అరాచకాలు , భూకబ్జాలపై సీబీ సిఐడి విచారణ జరపాలితాతా మధు డిమాండ్
ఈమేరకు సీఎం కేసీఆర్ ను కలిసి అన్ని ఆధారాలు ఇస్తానని వెల్లడి
పొంగులేటి నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిక
పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ఎవరెవరికి డబ్బులు ఇచ్చావో ఆధారాలు బయటపెడతామన్న మధు
ఆయన్ను ఏపార్టీ చేర్చుకునేందుకు సిద్ధంగా లేదని ఎద్దేవా …!
చీమలపాడు ఘటనపై శవరాజకీయాలు చేయడం తగదని హితవు

రాజకీయ ఉన్మాది , ఆర్థిక అరాచకవాది , భూకబ్జాదారుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై సీబీ సిఐడి విచారణ జరపాలని ఎమ్మెల్సీ బీఆర్ యస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు . ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ అధినేత సీఎం కేసీఆర్ ను కలిసి ఆధారాలతో కూడిన పేపర్లు అందజేస్తానని ప్రకటించారు . మంగళవారం ఖమ్మం జిల్లా బీఆర్ యస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల పొంగులేటి సీఎం కేసీఆర్ పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు . ఆయన చేసిన భూకబ్జాలు , దందాలు , ఆర్థిక అరాచకాలు , అన్ని ఇన్ని కావని వాటి అన్నింటిపై విచారణ జరగాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు . సీఎం కు సైతం అవినీతి మరక పూయడానికి వివిధ ఛానళ్లలో ఆయన ఇస్తున్న ఇంటర్వూ లద్వారా చెపుతున్న అబద్దాలను ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు . శ్రీనివాస్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే తగైనా గుణపాఠం చెపుతామని హెచ్చరించారు . ఎనిమిదిన్నర సంవత్సరాలు పార్టీలో ఉండి అనేక విధాలుగా పార్టీ ద్వారా లబ్దిపొంది పార్టీపై అవాకులు చవాకులు పేలడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . పార్టీ టికెట్ ఇవ్వలేదని చెపుతున్న శ్రీనివాస్ రెడ్డి తనకు ఇంచార్జి ఇచ్చిన మధిర నియోజకవర్గాన్ని ఎందుకు గెలిపించలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు . వైరాలో సీఎం కేసీఆర్ బి ఫారం ఇచ్చిన మదన్ లాల్ ను ఎందుకు ఓడించారో చెప్పాలని అన్నారు . జిల్లాలో కొందరిని ఓడించడానికి ఎవరెవరికి ఎలా డబ్బులు ఇచ్చావో ఆధారాలతో సహా బయట పెడతామని అన్నారు . రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి. వాటికి మంటగలిపిన శ్రీనివాస్ రెడ్డి దిగజారి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, పార్టీని సీఎం కేసీఆర్ ను బదనాం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతవరకు సబబో చెప్పాలని అన్నారు .

ఒక్కసారి ఎంపీగా అదికూడా సిపిఎం అండతో గెలిచిన నీవు ఇంతగా వీర్రా వీగితే రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా చేసిన స్వర్గీయ జలగం వెంగళ రావు , ఎంత వీర్రా వీగాలని అన్నారు . అదే విధంగా జిల్లా నుంచి అనేక సార్లు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన బోడేపూడి వెంకటేశ్వరరావు ,రజబ్ అలీ , మంచికంటి కిషన్ రావు , పువ్వాడ నాగేశ్వరరావు , రామిరెడ్డి వెంకట రెడ్డి లాంటి వారు ఏనాడైనా నాది ,నేను అని అన్నారా…? వీర్రా వీగరా…? అని ప్రశ్నించారు .

చీమలపాడు ఘటన జరగటం దురదృష్టకరందాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం ఏమి విజ్ఞత అని అన్నారు . దీనికి తనపైన , ఎంపీ నామ నాగేశ్వరరావు పైన , ఎమ్మెల్యే రాములు నాయక్ పైన ముద్దాయిలుగా కేసులు పెట్టాలని అనడం నీ ఛండాలపు రాజకీయాలకు నిదర్శనమన్నారు . చేతనైతే వారికీ సహాయం చేయి , మేము కూడా వారిని ఆడుకుంటున్నాం . అంతే కానీ శవ రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు . అమిత్ షా పాల్గొన్న నావి ముంబై సభలో ఎండదెబ్బకు 13 చనిపోగా , 80 మంది అస్వస్థతకు గురైయ్యారని దానికి అమిత్ షా మీద కేసు పెడతారని ప్రశ్నించారు . అదే విధంగా యాదాద్రి వెళ్లి వస్తున్నా ఏపీ భక్తులు మరణిస్తే సీఎం జగన్ పై కేసులు పెడతారా అని ప్రశ్నించారు .

తన కూతురు పెళ్ళికి సీఎం కేసీఆర్ కు కార్డు ఇచ్చేందుకు ప్రగతి భవనం కు వెళ్ళితే అర్థ గంట కూర్చోబెట్టి కార్డు తీసుకునేటప్పుడు కనీసం ముఖం కూడా చూడలేదని సీఎం పై అబద్దాలు చెప్పటం మానుకోవాలని అన్నారు నీవు , నీ భార్య, నీ వియ్యంకుడు రఘురామా రెడ్డి , మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కలిసి కార్డు ఇవ్వడానికి వెళ్ళితే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడితే అబద్దాలు చెప్పి గౌరవ ముఖ్యమంత్రిపై అభాండాలు వేయడంపై తాతా మధు ఫైర్ అయ్యారు . అంతే కాకుండా నీ కుమారుడి నిశ్చతార్దానికి , పెళ్ళికి కేసీఆర్ , కేటీఆర్ హాజరైన విజయాన్ని మరిచిపోయావా అంటూ అప్పటి ఫోటోలను మీడియా ప్రతినిధులకు చూపించారు .

ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ యస్ సభ్యుడిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని అంటున్నావు ..అసెంబ్లీ గేటు దగ్గర నీవు ఏమైనా గేటి కీపర్ వా …? అంటూ ఎద్దవా జేశారు . రాజకీయ క్రాస్ రోడ్ లో ఉన్న పొంగులేటిని ఏపార్టీ చేర్చుకోవడాని సిద్ధంగా లేదని అందువల్ల మతిభ్రమించి మాట్లాడుతున్నారని వ్యంగ్య బాణాలు వదిలారు ….

మీడియా సమావేశంలో నగర మేయర్ పూనుకొల్లు నీరజ , డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , ఖమ్మం జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వర్లు , జిల్లా యువజన అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య , నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు , రూరల్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు , కార్పొరేటర్ కమ్మర్తపు మురళి , తెలంగాణ ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి , ఉప్పల వెంకటరమణ , నరేందర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

 

Related posts

కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్ విలీనం ప్రసక్తే లేదు: కోదండరామ్

Drukpadam

సీఎం కెసిఆర్ జోలికొస్తే నీ నాలిక చీరేస్తాం..పొంగులేటిపై ఎమ్మెల్సీ మధు ఫైర్

Ram Narayana

తీరుమారని రాజకీయాలు …తిట్ల దండకాలతో కొనసాగిన పవన్ ప్రసంగం…

Drukpadam

Leave a Comment