నకిలీ మందులు ,నాణ్యత లేని ఆహారం… ప్రజాజీవితాలతో చెలగాటం..!
–ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు సరే …డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ …?
–కాలం తీరిన మందులు అమ్ముతున్నారని ఆరోపణలు
–మెడికల్ షాపులు నిబంధనలు గాలికి
–నెలనెలా వసూళ్లకే పరిమవుతున్నారనే విమర్శలు
నకిలీ మందులు నాణ్యతలేని ఆహారంతో వ్యాపారాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు . నాణ్యతపై , నకిలీలపై కొరడా జులిపించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి గాలికి వదిలేస్తున్నారు .ఖమ్మం లోని మయూరి సెంటర్ లో గల ఒక స్వీట్ షాప్ లో ఇటీవల ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేశారు . అందులో కాలం తీరిన జ్యూస్ అమ్ముతున్నారని గుర్తించారు …దానిపై కేసు నమోదు చేయడం జరిగింది . మంచిదే ఇక్కడ కాలం తీరిన ఫుడ్ అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు .అదికూడా ఫిర్యాదు వస్తే తనిఖీలు చేశారు తప్ప వారు చేసింది కాదు .కానీ ఫిర్యాదు లేకపోతె తనిఖీలు ,దాడులు ఉండవు . ఇది ఒక్క మాయిరి సెంటర్ లోనే కాదు ఒక్క ఖమ్మం లోనే కాదు రాష్ట్రమంతా ఇదే విధంగా ఉంది. పర్వేక్షించాలిసిన అధికారులు చేతులు సాచి , చేతులు దులుపుకుంటున్నారు .
కారణం వారి నెల వారి మామూళ్లేననేది బహిరంగ రహస్యమే .. ఒక్క స్వీట్ షాప్ మాత్రమే కాదు హోటల్స్ ,బజారున అమ్మే తినుబండారాలు , లొట్టలేసుకుని తింటున్న గప్చిప్ లు అందులో వారు కలుపుతున్న రకరకాల పదార్థాలు ప్రమాదమకరమని, వారు వాటిని తయారు చేసే తీరు అత్యంత అపరిశుభ్రంగా ఉంటుందని తెలిసినా, వాటిని పట్టించుకోవడం లేదు . చివరకు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కూడా ఒక సందర్భంలో గప్చిప్స్ లు ,చాట్ బండారాలు తిననడం వల్ల ఆరోగ్యాలు పాడవుతాయని ప్రకటించారు .
అయినప్పటికీ నాణ్యత లేని ఫుడ్స్ ఇష్టానుసారం అమ్ముతున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టించుకోరు . తన నెల వారి జీతాలకంటే వారికీ వస్తున్నా ఆదాయం లక్షల్లో ఉంటుంది కనుక …దీనిపై అజాయిషి చేయాల్సిన పై అధికారులు అంతే ఉన్నారు . ఇక నాన్ వెజిటేరియన్ విషయం చెప్పాల్సిన పనిలేదు …ఈగలు ,దోమలు ,వాటిమీద చేరుతున్నాయి. రహదార్ల పక్కనే చనిపోయిన చేపల అమ్మకాలు చాలచోట్ల దర్శనమిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు . మాంసం ,చికన్ దుకాణాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. అయినా వాటిపై నిఘా నియంత్రణ లేదు… అనేక షాపుల్లో కాలం తీరిన వస్తువులను అమ్ముతున్నారు.ఏవైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ పట్టించుకోడు . షాపులను బట్టి మామూళ్ల మత్తులో ఆశాఖ మునిగిపోతుందనే విమర్శలు ఉన్నాయి. ఇక పెద్ద షాపుల్లో సైతం కాలం తీరిన వస్తువులను , తినే పదార్థాలను అమ్ముతున్నా వాటి జోలికి పొరనే విమర్శలు ఉన్నాయి. గతంలో వైరా రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న దావత్ హోటల్ లో నాణ్యత లేని ఫుడ్ అమ్ముతున్నట్లు గుర్తించారు . హోటల్ ను సీజ్ చేశారు . కేసులు కూడా నమోదు చేసి హడాహుడి చేశారు . ఇక కొన్ని హోటల్స్ లో బల్లలు క్లిన్ చేసేవారితోనే టిఫిన్ సప్లయి చేయిస్తుంటారు . దీనిపై ఎలాంటి నియంత్రణ నిఘా ఉండదు … ఇక తూనికలు కొలత శాఖ కూడా అంతే ఉంది … ఇప్పటికి మార్కెట్లో కిలో ,అర కిలోకి ముడి రాళ్లతోనే వ్యాపారం జరుగుందనే ఆరోపణలు ఉన్నాయి. అన్ని శాఖలకు అధికారులు ఉన్నా, ప్రజలు మోసగించబడుతూనే ఉన్నారు …. ప్రధానంగా కూరగాయలు , వీధి వ్యాపారుల వద్ద తూనికలు కొలతల వ్యాపారంలో పేద ,బడుగు ,బలహీన వర్గాలు, రెక్కాడితే గానీ డొక్కాడని రోజు కూలీలు మోసాలకు గురి అవుతున్నాయి.
డ్రగ్ ఇన్స్పెక్టర్ దాడులు కరువు…
ఇక డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నా మందుల షాపుల నాణ్యత ప్రమాణాలు పట్టించుకోరు .సంఘం తరపునే నెలవారి మామూళ్లు ముట్టచెప్పడం జరుగుతుందని సమాచారం . కోట్లలో జరుగుతున్న ఈ వ్యాపారంలో అవినీతి చేతులు మారుతుంది. 10 పైసలు ఖరీదు అయ్యే టాబ్లెట్ ను రూపాయకు అమ్ముతున్నారు . ప్రధానంగా షుగర్ , బీపీ టాబ్లెట్స్ లో కంపెనీలు అధికశాతం షాపులకు , డాక్టర్లకు పర్శంటేజ్ లు ఇస్తున్న విషయం బహిరంగమే . నాణ్యతలేని మందులు అమ్మతున్నారనే విమర్శలు ఉన్నా డ్రగ్ ఇన్స్పెక్టర్లు పట్టించుకున్న దాఖలాలు కరువయ్యాయి. . మందుల వ్యాపారం అంటే పర్శంటేజ్ ల వ్యాపారంగా మారింది. నిత్యం తనిఖీ చేయాలిసిన ఆశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఒక షాప్ పెట్టాలంటే దానికి నియమ నిబంధలను ఉన్నాయి. మ్యామ్యాలు ముట్టచెపితే వాటిని పట్టించుకోరు … డ్రాగ్ ఇన్స్పెక్టర్ ను ప్రసన్నం చేసుకుంటే ఇట్టే పర్మిషన్లు వస్తున్నాయి. కాలం తీరిన , నాణ్యతలేని మందులు అమాయకులైన ప్రజల ముఖాన కొట్టి సొమ్ము చేసుకుంటున్నారు . ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆరోగ్యం పేరుతో దందా నడుపుతున్నారు .
ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం దీనిపై ద్రుష్టి సారించి ప్రజలకు మేలు చేస్తారని ఆశిద్దాం …