Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం కాంగ్రెస్ లో రేవంత్ నిరుద్యోగ నిరసన ర్యాలీ జోష్…

ఖమ్మం కాంగ్రెస్ లో రేవంత్ నిరుద్యోగ నిరసన ర్యాలీ జోష్…
-ఎన్నికల సైరన్ మోగించిన టీపీసీసీ చీఫ్ రేవంత్
-కేసీఆర్ సర్కారుపై నిప్పులు
-తెలంగాణ యువకులను పాతరేసి కేసీఆర్ అంటూ విమర్శలు
-ఒంటి కన్ను శివరాసన్ అంటూ మంత్రి పువ్వాడ అజయ్ పై ధ్వజం
-లీకులకు కారణమైన మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలనీ డిమాండ్
-ఖమ్మం జిల్లాలో 10 కి సీట్లు గెలిపించాలని పిలుపు
-ఇక్కడ 10 వస్తే రాష్ట్రంలో 90 తెస్తామన్న రేవంత్ …

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆధ్వరంలో సోమవారం నిరుద్యోగ నిరసన ర్యాలీ జరిగింది. ఈకార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరై యువకుల్లో , కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు . నీళ్లు ,నిధులు , నియామకాల కోసం 12 వందల మంది ఆత్మబలిదానంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 2014 లోనే లక్ష 7 వేల మందికి ఇస్తానన్న ఉద్యోగాలు ఏమైయ్యాయని ప్రశ్నించారు . ఇటీవల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కాంగ్రెస్ పార్టీ వత్తిడితో 80  వేల  మందికి ఉద్యోగాలు ఇస్తానని రాష్ట్ర శాసనసభ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఇంటికో ఉద్యోగం కాదు …ఉరుకొకటైన ఉద్యోగం ఇచ్చారా అని ప్రశ్నించారు . చెప్పిన మాటలు , చేసిన వాగ్దానాలు మరిచి నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ ను గద్దె దించాలని పిలుపు నిచ్చారు .

1969 లో ఖమ్మంలో ఉద్యోగాల కోసం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష తోలి దశ ఉద్యమం 2014 సాకారమైందని అన్నారు . ఇక్కడ రాజేసిన నిప్పే రాష్ట్ర ఏర్పాటుకు కారణమైందని అందుకు ఖమ్మం జిల్లా ప్రజలను అభినందిస్తున్నానన్నారు . నిరుద్యోగ సమస్యపై చేపట్టిన నిరసన ర్యాలీ ఇంత పెద్ద మొత్తంలో జయప్రదం చేసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ , రేణుక కౌదరీ కి , భట్టి విక్రమార్క కు ధన్యవాదాలు తెలిపారు . ఇదే ఈవిషయాన్ని ఢిల్లీ లో సోనియా కు , ప్రియంకాలకు చెపుతానని అన్నారు.

జిల్లాలో 10 కి 10 సీట్లు తెస్తే రాష్ట్రంలో 90 తెచ్చే భాద్యత మాది …

యువకులు చాలామంది ర్యాలీ సందర్భంగా 10 కి 10 అంటుంటే అర్థం కాలేదు .సంభాని ని అడిగా ఏమిటని ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీకి 2014 ఒకేటే సీటు 2018 ఎన్నికల్లో ఒకటే సీటు వచ్చిందని అన్నారు .ఈసారి 10 కి 10 తెస్తామని అంటున్నారు .. మీరు 10 కి 10 తెస్తే రాష్ట్రంలో 90    కాంగ్రెస్ పార్టీకి వచ్చే భాద్యతను మేము తీసుకుంటామని సభికుల హర్షద్వానాలమధ్య తెలిపారు . పేపర్ లీకుల గురించి భాద్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా సమాచారం ఇచ్చినవారిని పిలిచి విచారించడాన్ని రేవంత్ తప్పు పట్టారు . టీఎస్ పీఎస్ ప్రశ్నపత్రాలు లీకువల్ల 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు అంధకారం అయ్యాయని ప్రభుత్వ చర్యలను దుయ్యబట్టారు . కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తుందని నిరుద్యోగులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు . ఈ ప్రభుత్వం ప్రశ్నించే వారిపై కేసులు పెడుతుందని తనపై ఇప్పటికే 130 కేసులు పెట్టిందని , ఇక్కడ ఒంటి కన్ను శివరాసన్ కాంగ్రెస్ ,కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలపై కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈసారి ఎన్నికల్లో ఆయన్ను ఇంటికి పంపిస్తారా …అంటూ సభికులను ప్రశ్నించారు .

ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి అవినీతి అక్రమాలు ఎక్కువయ్యాయని , కొండలు దోచుకుంటున్నారని కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని ఇలా చేస్తే చూస్తూ ఊరుకోమని తన చేతికి ఉన్నవి గాజులు కాదు విష్ణు చక్రాలని గుర్తుంచుకోవాలని  కేంద్ర మాజీమంత్రి రేణుక చౌదరి  హెచ్చరించారు. అంతకు ముందు ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి మయూరి సెంటర్ వరకు నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించారు . రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు . సభలో మాజీ పీసీసీ అధ్యక్షులు , వి .హనుమంతరావు, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ , భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య , మాజీమంత్రులు షబ్బీర్ అలీ , సంభాని చంద్రశేఖర్ ,మాల్ రెడ్డి రంగా రెడ్డి , తదితరులు పాల్గొని ప్రసంగించారు. సభలో పీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు , రాయల నాగేశ్వర రావు , జావీద్, పాల్గొన్నారు. సభకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు.

Related posts

ఆ కేసులతో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టడం అసాధ్యం: నాగం జనార్దన్ రెడ్డి…

Drukpadam

రాజకీయాలకు ఆజాద్ గుడ్‌బై? రాష్ట్రపతిగా రానున్నారా ?

Drukpadam

క‌రోనా థ‌ర్డ్ వేవ్‌పై ప్ర‌ధాని మోదీ స్పంద‌న‌…

Drukpadam

Leave a Comment