Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బ్రిటన్ రాజు పట్టాభిషేకానికి రూ.1,020 కోట్లు ఖర్చు

బ్రిటన్ రాజు పట్టాభిషేకం అంటే ఖర్చు ఇలాగే ఉంటుంది!

  • బ్రిటన్ రాజుగా చార్లెస్
  • బ్రిటీష్ రాచరికపు పరంపరలో ఆయన ఇక కింగ్ చార్లెస్-3
  • పట్టాభిషేకానికి రూ.1,020 కోట్లు ఖర్చు
  • మే 6వ తేదీన పట్టాభిషేకం
  • లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో కార్యక్రమం
  • హాజరుకానున్న ప్రపంచ ప్రముఖులు

బ్రిటన్ రాజు ఫిలిప్స్ 2021లో కన్నుమూశారు. ఆ మరుసటి ఏడాదే బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 తుదిశ్వాస విడిచారు. అర్హత ప్రకారం ఆమె కుమారుడు చార్లెస్ రాజుగా నియమితులయ్యారు. ఆయనను బ్రిటీష్ రాచరికపు పరంపరంలో కింగ్ చార్లెస్-3గా పిలవనున్నారు. ఇప్పుడాయన పట్టాభిషేకానికి బ్రిటన్ సన్నద్ధమవుతోంది.

మే 6వ తేదీన జరిగే ఈ మహోత్సవానికి రూ.1,020 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఖర్చంతా బ్రిటన్ ప్రభుత్వానిదే. బ్రిటీష్ రాజ వంశీకులు వివాహాలను సొంత ఖర్చుతోనే చేసుకుంటారు. పట్టాభిషేకం ఖర్చు మాత్రం ప్రభుత్వమే భరిస్తుంది.

కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకాన్ని 3.7 కోట్ల మంది వీక్షిస్తారని అంచనా. నాడు 1953లో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్-2 పట్టాభిషేకం కార్యక్రమాన్ని 3 లక్షల మంది నేరుగా వీక్షించారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఈ కార్యక్రమం జరగనుంది. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ కుర్చీని ఈ పట్టాభిషేకం కోసం బయటికి తీస్తున్నారు.

అయితే, ఈ పట్టాభిషేకానికి అయ్యే ఖర్చు కంటే, ఈ కార్యక్రమం టీవీ హక్కుల విక్రయం ద్వారా ఎక్కువ మొత్తం వస్తుందని భావిస్తున్నారు. బ్రిటన్ కు సంబంధించి ఇది అత్యున్నత కార్యక్రమం కావడంతో వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు.

ఇక, మే 6వ తేదీనే పట్టాభిషేకం జరగడానికి ఓ కారణం ఉంది. ఓ ఫుట్ బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ కు ఇబ్బంది లేకుండా కింగ్ చార్లెస్ ఈ తేదీలో తమ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారట.

Related posts

విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 1400 ఎకరాల భూముల విక్రయ ప్రక్రియ ప్రారంభం

Ram Narayana

అది పొట్టా?.. బ్లేడ్‌ల కొట్టా?.. యువకుడి కడుపులో 56 బ్లేడ్ ముక్కలు!

Drukpadam

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రాకపోకలు పునరుద్ధరించిన టీటీడీ

Drukpadam

Leave a Comment