ఆంధ్రప్రదేశ్

పువ్వాడ నాగేశ్వరరావును పరామర్శించిన తమ్మినేని, పోతినేని…!

పువ్వాడ నాగేశ్వరరావును పరామర్శించిన తమ్మినేని, పోతినేని
-పువ్వాడ కోలుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన తమ్మినేని
-పువ్వాడ రాజకీయ సలహాలు సూచనలు అవసరమని తమ్మినేని అభిప్రాయం
-రాష్ట్ర ,జిల్లా రాజకీయాలను తమ్మినేని ద్వారా ఆరా తీసిన పువ్వాడ
-వామపక్షాల ఐక్యత అవసరం అన్న పువ్వాడ …

ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్‌ లోని రవాణా శాఖ మంత్రి గారి నివాసంలో విశ్రాంతి పొందుతున్న సిపిఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావుని బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వారు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాసన సభ్యులుగా, సిపిఐ జాతీయ నాయకులుగా ప్రజలకు ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. రాష్ట్ర, జిల్లా రాజకీయ పరిస్థితులపైన తమ్మినేనిని అడిగి తెలుసుకున్నారు. తిరిగి పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ రాజకీయాలను కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.

పువ్వాడ ఆరోగ్యం కుదుట పడడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ప్రస్తుత రాష్ట్ర, జిల్లా రాజకీయ పరిణామాలు, వామపక్షాల ఐక్యత మరియు ఇతర రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. పువ్వాడ ప్రస్తుత సమయంలో వామపక్షాల ఐక్యత ఎంతో అవసరం అని ఆయన ఆకాంక్షించారు. వారి వెంట రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఉన్నారు.

Related posts

ఏపీలోనూ సినిమా టికెట్స్ ధర పెంపుకు ,బెనిఫిట్ షోలకు అనుమతి వద్ద …సిపిఐ రామకృష్ణ

Ram Narayana

రూ.8 లక్షల ఆదాయం ఉన్న వారిని పన్ను నుంచి మినహాయించాలి: మద్రాస్ హైకోర్టులో పిటిషన్!

Drukpadam

తెలంగాణలో 3.06 కోట్ల మంది ఓటర్లు, అక్కడ జూబ్లీహిల్స్‌లో అత్యధిక ఓటర్లు!

Ram Narayana