Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు స్వరంలో ఎందుకబ్బా …?

చంద్రబాబు స్వరంలో ఎందుకబ్బా …?
రఘురామకృష్ణరాజును చంపేస్తారేమోననే అనుమానాలు కలిగాయి
రఘురాజు విమర్శలను, వైసీపీ విమర్శలను పోల్చి చూడాలి
అసెంబ్లీలో నాపై కూడా వైసీపీ సభ్యులు దుర్భాషలాడారు
మనుషుల ప్రాణాలతో ఆడుకుంటారా?
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.దీనిపై టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు కస్సు బుస్సులాడారు. ఆటవిక పాలనా ,రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుందన్నారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోచారు. కాని ఈ రోజు ఆయన స్వరంలో మార్పు కనిపిస్తుంది. దీనిపై పలువురు చంద్రబాబు స్వరంలో మార్పుకు కారణాలు ఏమిటబ్బా అని ఆరా తీస్తున్నారు. పార్టీ నాయకులూ కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కస్టడీలో తనను పోలీసులు తీవ్రంగా హింసించారని, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సుప్రీంకోర్టు దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

రఘురాజు చేసిన విమర్శలను, వైసీపీ నేతల విమర్శలను పోల్చి చూడాలని చెప్పారు. అసెంబ్లీలో తనను కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దుర్భాషలాడారని అన్నారు. రఘురాజును చంపేస్తారేమోననే అనుమానాలు అందరిలో కలిగాయని చెప్పారు. మనుషుల ప్రాణాలతో ఎలా ఆడుకుంటారని ప్రశ్నించారు.

మరోవైపు రఘురాజుకి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ముగ్గురు వైద్యులతో బోర్డును ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అనంతరం సీల్డ్ కవర్ లో రిపోర్టును ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఆదేశాలు జారీ చేసింది. జ్యూడీషియల్ అధికారిని నియమించాలని, ఆయన సమక్షంలో వైద్య పరీక్షలను నిర్వహించాలని టీఎస్ హైకోర్టును ఆదేశించింది.

Related posts

ప్రజలకు కావాల్సింది మొసలి కన్నీరు కాదు.. టీకాలు: మోదీపై కాంగ్రెస్ ఫైర్!

Drukpadam

క్యాసినో నిర్వహించలేదు.. గతంలో మాదిరే శిబిరాలు మాత్రం కొనసాగాయి: గుడివాడ ఘటనపై వల్లభనేని వంశీ!

Drukpadam

అమిత్‌ షా, నడ్డాతో మోదీ సుదీర్ఘసమావేశం…మంత్రివర్గంలో భారీ మార్పులంటూ ఊహాగానాలు!

Drukpadam

Leave a Comment