నేటి సాయంత్రం కర్ణాటక సీఎల్పీ సమావేశం ….సీఎంగా ఎవరు …?
సిద్దరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ మధ్య పోటీ…!
రంగంలోకి అధిష్టానం …మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో నేత ఎంపిక
కర్ణాటకలో నేటి సాయంత్రం 6 గంటలకు సీఎల్పీ సమావేశం
పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సుర్జేవాల్ సమక్షంలో ఎమ్మెల్యేల సమావేశం
సిద్దరామయ్య వైపే అధిష్టానం మొగ్గు, డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవి అంటూ ప్రచారం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎంపిక పై ద్రుష్టి సారించింది . ఇద్దరు నేతలు సీఎం సీటుకోసం పోటీపడుతున్నారు . అయితే ప్రజలు మెచ్చిన నాయకుడిగా సిద్దరామయ్య ఉండగా , పార్టీ మెచ్చిన నాయకుడిగా డీకే శివకుమార్ ఉన్నారు . ఇద్దరు ఇద్దరే పార్టీని కష్టకాలంలో ఆదుకున్నారు . కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిన భరించారు . అందుకే సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది….సాయంత్రం కొత్తగా ఎన్నికకైనా శాసన సభ్యులతో జరిగే సమావేశంలో సీఎం ను ఖరారు చేస్తారు . ఇద్దరి మధ్య పోటీ ఉన్న ఎంపికలో పెద్ద ఇబ్బందులు ఉండక పోవచ్చునని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం …
సిద్ధరామయ్యను సీఎం, డికే శివకుమార్‌ను డిప్యుటీ సీఎంగా ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అన్ని వర్గాలను కలుపుకుపోయేలా డిప్యూటీ సీఎంల ఎంపిక ఉంటుందని అక్కడి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లింగాయత్, వక్కళిగ, దళిత సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కబోతున్నాయట. సాయంత్రం సీఎల్పీ సమావేశం జరగనున్న నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నారు.