Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికాలో శ్వేతసౌధం వద్ద బీభత్సం సృష్టించిన ట్రక్…!

శ్వేతసౌధం వద్ద బీభత్సం సృష్టించిన ట్రక్…!

  • సోమవారం రాత్రి ఘటన
  • బారికేడ్లను ఢీకొట్టిన ట్రక్కు
  • భద్రతా సిబ్బంది అదుపులో డ్రైవర్‌ 
  • ఘటనపై దర్యాప్తు ప్రారంభం

అమెరికాలో భద్రతా డొల్లతనం ప్రతిసందర్భంలో కనిపిస్తుంది. గన్ కల్చర్ కు కొదవలేదు …వందలమంది అమాయకుల ప్రాణాలు తుపాకీ కాల్పుల్లో నేలరాలుతున్నాయి. అన్నెం పున్నెం ఎరగని అమాయకులు తుపాకీ తూటాలకు బలైపోతున్నారు . భూతాల స్వర్గం అనే చెప్పబడే అమెరికా లో ఉద్యోగాల కోసం , చదువులకోసం వచ్చిన కోట్లాదిమంది విదేశీయులు బుల్లెట్ల గాయాలకు అశువులు బాస్తున్నారు . అమెరికాలో అత్యంత భద్రతకు నీలంగా ఉన్న శ్వేతసౌధం వద్ద జరిగిన ఘటనలు వారి భద్రతా వైఫల్యాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిన్న రాత్రి ఒక ట్రాక్ శ్వేతసౌధం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొని మరి లోపలకి రావడం అధికారులను సిబ్బందిని సైతం ఆశ్చర్యానికి సైతం గురి చేసింది.

వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ సమీపంలోని లాఫేట్ స్క్వేర్‌ వద్ద ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి దూసుకొచ్చిన ఓ ట్రక్కు సెక్యూరిటీ బారికేడ్లను ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించినట్టు యూఎస్ సీక్రెట్ సర్వీస్ చీఫ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆంథోనీ గుగ్లీల్మీ తెలిపారు. 

బారికేడ్లను ట్రక్కు ఢీకొట్టిన తర్వాత ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లు, నడకదారులను మూసివేసినట్టు సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. అంతేకాదు, సమీపంలో ఉన్న హే ఆడమ్స్ హోటల్‌ను అధికారులు ఖాళీ చేయించినట్టు ‘ఫాక్స్ 5’ టెలివిజన్ న్యూస్ తెలిపింది. ట్రక్కు డోరును రిమోట్ రోబో సాయంతో తెరిచారు. అందులో అనుమానాస్పద వస్తువులు ఏవీ లేవని గుర్తించారు.

Related posts

హైద‌రాబాద్‌లో హిజాబ్ వివాదం.. పోలీసుల లాఠీచార్జీలో ప‌లువురికి గాయాలు!

Drukpadam

ఢిల్లీ నుంచి రాగానే గ‌వ‌ర్న‌ర్‌తో జ‌గ‌న్ భేటీ!

Drukpadam

వెల‌గ‌పూడిలో ఐదు ఎక‌రాలు కొన్న సీఎం చంద్ర‌బాబు…

Ram Narayana

Leave a Comment