అమిత్ షా ఖమ్మం సభ ప్రతిష్టాత్మకం, జయప్రదం చేయండి …బండి సంజయ్..!
–అనేక జిల్లాలు కోరినప్పటికీ అమిత్ షా పర్యటన ఖమ్మం కు ఇచ్చాం …
–జనసమీకరణలో పోటీపడాలి …
–కాంగ్రెస్ , బీఆర్ యస్ ల గెండెలదరాలి …
–కమ్యూనిస్టులు దాల్చా పార్టీలు …వారి ఖేల్ ఖతం
–సూది దబ్బడం అన్న కేసీఆర్ తో పొత్తు సిగ్గు చేటు ..
–ఖమ్మం లో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీ జయప్రదం…
–దాన్ని స్ఫూర్తిగా తీసుకోని పనిచేయాలి…
అమిత్ షా ఈనెల 15 న ఖమ్మం సభకు వస్తున్నారు . ఈసభకు జనసమీకరణ ప్రతిష్ట్మాకంగా తీసుకోని జయప్రదం చేయాలనీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు నిచ్చారు . శుక్రవారం ఖమ్మం వచ్చిన బండి సంజయ్ సభ ఏర్పాట్ల గురించి స్థానిక నాయకులతో సమీక్షా నిర్వహించారు . ఈసందర్భంగా ముఖ్య నేతలతో ఆయన మాట్లాడుతూ అమిత్ షా మొదటిసారి ఖమ్మం వస్తున్నారు . ఖమ్మం నాయకుల మీద నమ్మకం ఉంది . ఎక్కడ నిరుద్యోగ ర్యాలీకి ఎంతమంది వస్తారంటే వేయి మంది మాత్రమే వస్తారని చెప్పారు .కానీ ఎంతమంది వచ్చారు . కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది వచ్చారు …వచ్చారా …రాలేదా …అంటూ అందుకే ఖమ్మం గురించి అన్ని చోట్ల చూపుతుంటా…ఇక్కడ నిర్మాణం బాగుంది తలచుకుంటే చేసే నాయకులూ ఉన్నారు . కాంగ్రెస్ జిల్లా అంటున్నారు .ఇక్కడ పువ్వు వికసించాలి …అప్పుడే మనం మాట నిలబెట్టుకున్నవాళ్ళమౌతాం అని అన్నారు . బీజేపీకి తిరుగు లేదు …ప్రజల్లో ఆదరణ ఉంది .మనం బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకోని వెళ్ళాలి అన్నారు .
కమ్యూనిస్టులు దాల్చా పార్టీలు …
కమ్యూనిస్టుల గురించి ప్రస్తావిస్తూ అవి దాల్చా పార్టీలని వ్యంగ్య బాణాలు సంధించారు . వారు కూరగాయలు అమ్మే వారిని , కూలీలను పార్టీ ధర్నాలకు ,సభలకు తీసుకోని వస్తారని ….దాల్చా అంటే తెల్సా … టోకెన్ ఇచ్చి హోటల్ లో భోజనం పెట్టించి ప్రజలను ధర్నాలకు తీసుకోని వస్తారని ,
వారి పని అయిపోయిందని ఎద్దవా చేశారు… వాటిని సూది దబ్బడం లేని పార్టీలు అని కేసీఆర్ అన్న విషయాన్నీ గుర్తు చేశారు .అయినప్పటికీ సిగ్గు లేకుండా కేసీఆర్ తో కలిసి వెళ్లేందుకు సిద్దపడుతున్నారని అన్నారు .
భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి అనేక పార్టీలు ఓర్వలేక పోతున్నాయని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు .దేశానికి నరేంద్రమోడీ అమిత్ షా ల నాయకత్వం అవసరమని దేశ ప్రజలే కాకుండా ప్రపంచమే గుర్తించిందని అన్నారు . అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న భారత్ వైపు ప్రపంచం చూస్తున్నదని పేర్కొన్నారు . ఈ సమావేశంలో బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు కో –ఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి , మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు , జిల్లా నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి , జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ , సీనియర్ నాయకులు గంటల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు …