Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

నిశ్చలం ,నిష్కళంకం నా రాజకీయ జీవితం …పార్టీ మార్పువార్తలపై …తుమ్మల…!

నిశ్చలం ,నిష్కళంకం నా రాజకీయ జీవితంపార్టీ మార్పువార్తలపైతుమ్మల…!
కేసీఆర్ ఏది చేయమంటే అది ,ఎక్కడ చేయమంటే అక్కడ పోటీచేస్తా
కేసీఆర్ తో సుదీర్ఘకాలంగా స్నేహం
తెలంగాణ వచ్చిన తర్వాత పిలిచి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన నేత కేసీఆర్
నాహాయంలో 40 వేల కోట్లా నిధులతో జిల్లాలో అభివృద్ధి చేశా
బస్సు స్టాండ్ , కొత్త కలక్టరేట్ ఐటీ హబ్,రైల్ ఓవర్ బ్రిడ్జిలు
రహదారుల అభివృద్ధి హైవే లు ,రింగ్ రోడ్ ప్రతిపాదనలు
ఖమ్మం నగరాన్ని కార్పొరేషన్ చేయడం
మద్దులపల్లి మార్కెట్ , అమరావతినాగపూర్ హై వే
ఖమ్మంసూర్యాపేట హైవే అభివృద్ధి
సీతారామ ప్రాజక్టుభక్త రాందాసు ప్రాజక్టు ఘనత నాదే

తుమ్మల నాగేశ్వరావు మాజీమంత్రి టీడీపీ , టీఆర్ యస్ ప్రభుత్వాలలో సుదీర్ఘ కాలంపాటు మంత్రిగా పనిచేసి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేక ముద్రవేసిన నేత …ఆయన్ను “దృకపదం” పలకరించగా తన మనసులోని మాటలు పంచుకున్నారు ….తుమ్మల పార్టీ మారుతున్నారు …ఈ మధ్య రేవంత్ రెడ్డి కలిశారని ప్రచారం జరుగుతుందని ప్రశ్నించగా “రేవంత్ రెడ్డి నన్ను కలవడమా…? పచ్చి అబద్దం … నా రాజకీయ జీవితం నిశ్చలం ,నిష్కళంకం పార్టీ మారాల్సిన అవసరం అగత్యం నాకు లేదు …. టీడీపీలో ఉన్నదగ్గర నుంచి కేసీఆర్ నేను స్నేహితులం తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీకి ఇక్కడ భవిష్యత్ ఉండదని తెలుసు …కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ యస్ లో చేరాను ఆయన కూడా నన్ను గౌరవించి ఎమ్మెల్సీని చేసి మంత్రిపదవి ఇచ్చారు . అందువల్ల పార్టీ మార్పు జరగదు …కేసీఆర్ ఏమి చేయమంటే అది ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీచేస్తా” …అని తుమ్మల స్పష్టం చేశారు …

40 వేల కోట్లతో జిల్లా అభివృద్ధి చేశా ….

అంతకు ముందు నేను మంత్రిగా ఉండగా చేసిన అభివృద్ధి గురించి చెప్పాల్సిన పనిలేదు …తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాకు కేసీఆర్ 40 వేల కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పథకాలకు ఇచ్చారు …ప్రత్యేకంగా ఖమ్మం కార్పొరేషన్ గా చేయడంతో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాను . ఖమ్మం చుట్టూ ,జిల్లాలో రోడ్ల అభివృద్ధిలో నా శ్రమను ప్రజలు గుర్తుంచుకుంటే చాలు …ఖమ్మంలో ఇంటర్నల్ రోడ్లు , లకారం ట్యాంక్ బండ్, సర్దార్ పటేల్ స్టేడియం , బైపాస్ రోడ్ , ఫౌంటైన్లు ఏర్పాటు , కూరగాయల మార్కట్లు , కొత్త బస్సు స్టాండ్ , కొత్త కలెక్టరేట్ నిర్మాణం , ఐటీ హబ్ , మద్దులపల్లి మార్కెట్ , సూర్యాపేట – ఖమ్మం రోడ్ , నాగపూర్ , అమరావతి రోడ్ , దేవరపల్లి -సూర్యాపేట గ్రీన్ ఫీల్డ్ హైవే తహసీల్దార్ డంపింగ్ యార్డ్ ..అనేకం చేశాం … ఖమ్మం మరింత అభివృద్ధి కావాలంటే కొత్త రింగ్ రోడ్ అవసరం అందుకే దానికి కూడా రూపకల్పన చేశానని అన్నారు .

కరువు మండలం ఉన్న తిరుమలాయపాలెం మండలానికి భక్త రామదాస్ ప్రాజక్టు తీసుకోని వచ్చి వాళ్ళ పాదాలు కడిగాం…జిల్లాలో 4 లక్షల ఎకరాలకు నీరందించే సీతారాం ప్రాజక్టు నాకల …దాన్ని పూర్తీ చేయాలనీ ఇటీవల సీఎం ను కలిసి కోరాను . ఆయనకూడా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి తుమ్మల సలహాలు తీసుకోని ప్రాజక్టు త్వరగా పూర్తీ చేయాలనీ ఆదేశించారు . నా రాజకీయ జీవితం సంతృప్తిగానే ఉంది . పార్టీలు మారాల్సిన అవసరం ఆవశ్యకత లేదు అని కొట్టి పారేశారు ….

 

 

Related posts

‘అన్‌స్టాప‌బుల్ 2’లో చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్నీ అబద్దాలే: వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి!

Drukpadam

ప్రధాని మోదీ పై ఇంట బయట విమర్శల పరంపర…

Drukpadam

బెయిల్ రద్దవుతుందన్న భయంతోనే జగన్ ఢిల్లీ పరుగులు : యనమల…

Drukpadam

Leave a Comment