Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గొంతు పెంచి వాదిస్తే ప్రయోజనం ఉండదు.. వివేకా పీఏ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఫైర్…

గొంతు పెంచి వాదిస్తే ప్రయోజనం ఉండదు.. వివేకా పీఏ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఫైర్…

  • వివేకా హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలంటూ ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్‌
  • కృష్ణారెడ్డిని అనుమానితుడిగా సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొందన్న సునీత తరఫు లాయర్
  • విచారణ బుధవారానికి వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలంటూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా కృష్ణారెడ్డి తరపు న్యాయవాదిపై జస్టిస్ కృష్ణ మురారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు పెంచి వాదించినంత మాత్రాన ప్రయోజనం ఉండదంటూ సీరియస్ అయ్యారు.
ఎంవీ కృష్ణారెడ్డి వేసిన ఈ పిటిషన్ ను తొలుత హైకోర్టుకే పంపుతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందని, ముందు అక్కడ తేల్చుకోవాలని సూచించింది. అయితే ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసే సమయంలో వివేకా భార్య, కుమార్తెలను బాధితులుగా గుర్తించిన విషయాన్ని కోర్టు దృష్టికి సునీతారెడ్డి తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా తీసుకొచ్చారు.
ఈ కేసులో ఎంవీ కృష్ణారెడ్డిని కూడా అనుమానితుడిగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన విషయాన్ని కూడా ధర్మాసనం దృష్టికి సిద్ధార్థ లూథ్రా తీసుకొచ్చారు. సీబీఐ చార్జిషీట్ కాపీని సమర్పించడానికి బుధవారం దాకా గడువు కోరారు. దీంతో కేసు విచారణను బుధవారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

వివేకా హత్య కేసు: అదనపు సమాచారం ఇవ్వడం కోసం సమయం కావాలని అడిగిన వివేకా కూతురు

Viveka daughter asks for time in supreme court

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమను బాధితుడిగా గుర్తించాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. హత్యకు సంబంధించి మొదట తామే ఫిర్యాదు చేసినందున బాధితుడిగా గుర్తించాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. మరోవైపు, వైఎస్ సునీతారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇటీవల సీబీఐ మరో ఛార్జీషీటును దాఖలు చేసిందని, కృష్ణారెడ్డికి సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించి అదనపు సమాచారాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడానికి సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

కాగా, తనను బాధితుడిగా గుర్తించాలంటూ కృష్ణారెడ్డి దాఖలు చేసిన మిస్లేనియస్ దరఖాస్తులో సునీతారెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. అయితే హత్యపై ముందుగా సమాచారం ఇచ్చినంత మాత్రాన ఆయన బాధితుడు కాదని, కనీసం కుటుంబ సభ్యుడు కూడా కాదని సునీత అన్నారు. కృష్ణారెడ్డి బాధితుడు కాదని, దర్యాఫ్తును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆమె చెప్పారు. దీంతో ఇదివరకు ప్రతివాదిగా ఉన్న దస్తగిరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నేడు విచారణ జరగగా.. అదనపు సమాచారం కోర్టు దృష్టికి తీసుకురావడానికి సమయం కావాలన్న సునీతారెడ్డి వాదనలను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.

Related posts

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో ఏకాకి అయిన నుపుర్ శర్మకు నెదర్లాండ్స్ ఎంపీ మద్దతు!

Drukpadam

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి….సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దామోదర్ రెడ్డి , చంద్రశేఖర్

Drukpadam

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, బాలికల మిస్సింగ్ వివరాలు వెల్లడించిన కేంద్రం

Ram Narayana

Leave a Comment