Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

షర్మిల కాంగ్రెస్ లో చేరికపై కాంగ్రెస్ లోనే భిన్న వాదనలు …

షర్మిలతో చర్చలంటూ వార్తలు.. స్పందించిన జానారెడ్డి…

  • కాంగ్రెస్ నేతలతో షర్మిల సంప్రదింపులు నిజం కాదన్న జానారెడ్డి
  • తాను కూడా మాట్లాడలేదని వెల్లడి
  • ఇలాంటి మధ్యవర్తిత్వాలు చేయనన్న సీనియర్ నేత
  • షర్మిల కాంగ్రెస్ లో చేరికపై కాంగ్రెస్ లోనే భిన్న వాదనలు …
    ఆమె చేరుతుందంటూ కొందరు …చేరడంలేదని మరికొందరు
    వైయస్ కుటుంబం పార్టీలోకి వస్తామంటే ఎవరు వద్దంటారన్న భట్టి
    షర్మిలను కాంగ్రెస్ లో ఎందుకు చేర్చుకుంటారని ప్రశ్నించిన చింత మోహన్
    షర్మిల కాంగ్రెస్ లో చేరుతారన్న కెవిపి
    షర్మిల కాంగ్రెస్ లో చేరిక వార్తలపై భిన్నంగా స్పందించిన జానారెడ్డి
  • కాంగ్రెస్ లో ఏమి జరుగుతుంది. ప్రత్యేకంగా షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.దానిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారంటూ వార్తలు వచ్చాయి. ఆమె కాంగ్రెస్ లో చేరుతుందంటూ కొందరు , చేరడంలేదంటూ మరికొందరు చెప్పడం గందరగోళంగా మారింది .దీనిపై తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ స్పందిస్తూ ఆమె చేర్చుకోవడం ఎందుకు మా నెత్తిన పెట్టికొడవనికా…అంటూ ఘాటుగా స్పందించారు . అయితే వైయస్ ఆత్మగా చెప్పబడుతున్న కెవిపి మాత్రం సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ కె .జానారెడ్డి మాత్రం భిన్నంగా స్పందించారు . తనకు ఆ విషయం తెలియదని . తాను ఆమె తో మాట్లాడలేదని అన్నారు . నేను ఆలాంటి మధ్యవర్తిత్వం జరపబోనని కరాఖండిగా చెప్పారు …
కాంగ్రెస్‌ పార్టీలో షర్మిల చేరుతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. చర్చలు కొలిక్కి వచ్చాయని, షర్మిల కొన్ని కండిషన్లు పెట్టారని, ఇవాలో రేపో చేరిపోతారని జోరుగా ఊహాగానాలు సాగాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో రెండుగా విడిపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోందని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో జానారెడ్డితో షర్మిల చర్చించినట్లు, రాహుల్ గాంధీ వద్దకు జానారెడ్డితో రాయబారం పంపినట్లు ప్రచారం సాగింది. దీనిపై పీసీసీ చేరికల కమిటీ ఛైర్మన్ కె.జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. షర్మిల తనతో మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలతో షర్మిల సంప్రదింపులు నిజం కాదని జానారెడ్డి అన్నారు. ‘‘షర్మిల నాతో మాట్లాడినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. పార్టీ నాకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే, ఆ పని మాత్రమే చేస్తా. ఇలాంటి మధ్యవర్తిత్వాలు చేయను” అని స్పష్టం చేశారు.

Related posts

పాదయాత్రలు చేసినా, మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే:బీజేపీపై జగదీశ్ రెడ్డి ఫైర్

Drukpadam

శివసేన లో తిరుగుబాటు నేపథ్యంలో ఎన్సీపీ దిద్దుబాటు చర్యలు …అన్ని కమిటీలు రద్దు…!

Drukpadam

చిక్కుల్లో సినీ హీరో నాగార్జున..ఆయనపై కబ్జా కేసు

Ram Narayana

Leave a Comment