Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు విజయం

  • నేడు టీఎఫ్ సీసీ ఎన్నికల పోలింగ్
  • ముగిసిన ఓట్ల లెక్కింపు
  • 31 ఓట్లతో నెగ్గిన దిల్ రాజు
  • అధ్యక్ష ఎన్నికల్లో సి.కల్యాణ్ ఓటమి
  • ఫిల్మ్ చాంబర్ కార్యదర్శిగా దామోదర ప్రసాద్ ఎన్నిక

తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగాయి… ఇద్దరు హేమ హేమీలు తలపడ్డ ఈ ఎన్నికల్లో ముందుగా ఊహించిన విధంగానే దిల్ రాజ్ ఎన్నికయ్యారు ..

తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్ సీసీ) నూతన అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నిక కావడంపట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయన్ను అభినందించారు . ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఫలితాలు వెల్లడించారు. ఇవాళ జరిగిన పోలింగ్ లో దిల్ రాజు తన ప్రత్యర్థి, సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ పై విజయం సాధించారు. దిల్ రాజు 31 ఓట్లతో గెలుపొందారు. ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా దామోదర ప్రసాద్ విజయం సాధించారు. టీఎఫ్ సీసీ కోశాధికారిగా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు.

టీఎఫ్‌సీసీ ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

  • సభ్యులు దేని కోసం పోటీపడుతున్నారో అర్థం కావడం లేదన్న తమ్మారెడ్డి
  • ఎన్నికల ప్రచారం చూస్తుంటే భయమేస్తోందని వ్యాఖ్య
  • ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్
  • అధ్యక్ష బరిలో దిల్‌రాజు, సి.కల్యాణ్
Bharadwaja Thammareddy Sensational Comments On TFCC Elections

తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశారు. సభ్యులు దేనికి పోటీపడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోషపడాలో.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందుకు సిగ్గుపడాలో తెలియడం లేదని అన్నారు. తాను కూడా ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా పనిచేశానని, చాలా ఎన్నికలను చూశానని పేర్కొన్నారు. ఇలాంటి వాతావరణాన్ని తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నికల ప్రచారం చూస్తుంటే భయమేస్తోందని అన్నారు. 

టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. అధ్యక్ష పదవి కోసం దిల్‌రాజు, సి.కల్యాణ్ పోటీ పడుతున్నారు.

Related posts

ద‌ళిత బాలుడిని దారుణంగా కొట్టి, కాళ్లు నాకించిన యువ‌కులు.. 

Drukpadam

హైదరాబాద్ పర్యటనపై మోదీ ట్వీట్!

Drukpadam

ఐటీ ,ఈడీ దాడులకు రాజకీయ రంగు …

Drukpadam

Leave a Comment