Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఐటీ ,ఈడీ దాడులకు రాజకీయ రంగు …

ఐటీ ,ఈడీ దాడుల వెనక రాజకీయ కోణం….!
-టీఆర్ యస్ ను బలహీన పరిచేందుకేనా …?
-మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓటమిని తట్టుకోలేక పోతున్నారా ??
-బలమైన రాజగోపాల్ రెడ్డి గెలవకపోతే ..2023 ఎన్నికల పరిస్థితి ఏమిటని ప్రశ్న?
-ఐటీ ,ఈడీ దాడులకు రాజకీయ రంగు …

రాష్ట్రంలో ప్రత్యేకించి ఖమ్మంలో ఐటీ ,ఈడీ దాడులు జరగడం పెద్ద చర్చనీయాంశంగా మారింది .బిలీఫ్ హాస్పటల్ లో సంచులకొద్దీ డబ్బు దొరికాయని అంటున్నారు . ఇందులో నిజమెంత అనేది నిర్దారణ కావాల్సి ఉంది.అయితే ఐటీ ,ఈడీ దాడులు రాజకీయ ప్రేరేపితమైనవని టీఆర్ యస్ వర్గాలు మండి పడుతున్నాయి. టీఆర్ యస్ లో ఉన్న బలమైన నాయకులను ప్రత్యేకించి కాపులను టార్గెట్ చేస్తూ జరిగిన దాడులుగా పేర్కొంటున్నారు . ఇది బలహీనవర్గాలు బీసీలపై జరిగిన దాడి అని ఘాటు విమర్శలు చేస్తున్నారు . మునుగోడులో ఉపఎన్నిక ద్వారా 2023 ఎన్నికలకు రోడ్ మ్యాప్ వేద్దామనుకున్న బీజేపీకి రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన అభ్యర్థి ఓటమి చెందటం పట్ల జీరించుకోలేక పోతున్నారు . దీంతో టీఆర్ యస్ ని దెబ్బతీసేందుకు తమ అస్త్రాలను ఉపయోగించాలని యోచనలో ఉన్న బీజేపీ మొదటగా ఐటీ , ఈడీలను రంగంలోకి దింపిందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఐటీ ,ఈడీ దాడులకు రాజకీయ రంగు పులుముకుంది .

ఖమ్మంలో అనేక ఆసుపత్రులు ,గ్రానైట్ కంపెనీలు ఉన్నా, కేవలం బిలీఫ్ , రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ , శ్రీరామ్ కిడ్నీసెంటర్ లపై,టీఆర్ యస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గ్రానైట్ కంపెనీలపై మాత్రమే ఎందుకు దాడి చేసినట్లు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే వద్దిరాజు రవి చంద్రతోపాటు తన సమీప బంధువు రాష్ట్రమంత్రి గంగుల కమలాకర్ ఇళ్లపైనా దాడులు జరగటం పై చర్చలు జరుగుతున్నాయి. మూడు ఆసుపత్రులు కాకుండా ఖమ్మం లో మరికొన్ని ఆసుపత్రులు కూడా ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రాలపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంపై విమర్శలు ఉన్నాయి. .పైగా పార్టీలు ,వివిధ ప్రజాసంఘాలు ఫిర్యాదులు చేయడం అధికారులకు ఆదాయవనరుగా మారుతున్నాయని అభియోగాలు ఉన్నాయి. అనేక ఆస్పత్రులు సరైన డాక్టర్లు లేకపోయినా , వైద్య వృత్తితో ఎలాంటి సంబంధం లేని వారు సైతం యజమానులుగా మారి హాస్పటల్స్ నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా , ఇష్టానుసారం బిల్లుల పేరుతొ వేలు ,లక్షలు వసూల్ చేయడం , పేషంట్లను పీడించడం ఖమ్మం లో నిత్యకృత్యంగా మారిందనే విమర్శలు ఉన్నాయి . అయితే మిగతావాళ్ళపైకి ఈడీ , ఐటీ వెళ్ళకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. బిలీఫ్ హాస్పటల్ నడుపుతున్న యజమాని మునుగోడు ఎన్నికలకు డబ్బులు తరలించారని అవి అన్ని కూడా బ్లాక్ మని గా నిఘా వర్గాలకు సమాచారం అందిందని విశ్వసనీయ సమాచారం .రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు చెందిన డాక్టర్ మువ్వా లక్ష్మి రాజేశ్వరి , శ్రీరామ్ కిడ్నీ సెంటర్ కు చెందిన డాక్టర్ గుర్నాథరావు లు బ్లాక్ మని పెద్ద మొత్తంలో మునుగోడుకు తరలించడం వల్లనే చిక్కు వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇంతవరకు ఆస్పత్రి వర్గాలు గానీ , ఐటీ , ఈడీ సంస్థలు గానీ దాడులపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం . మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ వద్దిరాజు రవి చంద్రలు తమ కార్యాలయాలు ,ఇళ్లపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు . తాము చట్ట ప్రకారం వ్యాపారాలు చేస్తున్నామని ఫెమా నిబంధనలు ఉల్లంఘించలేదని ప్రటించారు .

ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండించిన ఎంపీ రవిచంద్ర…

గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై ఈడీ, ఐటీలు జరిపిన దాడులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.తన కుటుంబ సభ్యులు,దగ్గరి బంధువు గంగుల కుటుంబానికి సంబంధించిన గాయత్రి, శ్వేత గ్రానైట్ కంపెనీలపై ఈడీ,ఐటీలు దాడులకు దిగడం శోచనీయమన్నారు.వాస్తవంగా ఈ పరిశ్రమతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని,తమకు ఎటువంటి రాయితీలు ఇవ్వలేదని,ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి మాత్రమే వస్తుందని వివరించారు. కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్ దారుణంగా దెబ్బతిని గ్రానైట్ పరిశ్రమ తీవ్ర కష్టాలలో ఉందని,నష్టాల బారిన పడిందని రవిచంద్ర చెప్పారు.ఈ పరిశ్రమలో జీరో వ్యాపారం అనే మాటే లేదని, పారదర్శకతతో, నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామని తెలిపారు.ఈడీ,ఐటీ అధికారులు జరిపే విచారణకు తాము పూర్తి సహకారం అందిస్తామని,24గంటలు అందుబాటులో ఉంటామని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.వందల మందికి ఉద్యోగాలిచ్చి,వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న,75%శాతం నష్టాల బారినపడి ఇబ్బందులు పడుతున్న గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.

Related posts

ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు రాక!

Drukpadam

హైదరాబాద్‌లో ఇక 45 నిమిషాలపాటు ఉచిత వై-ఫై సౌకర్యం.. ప్రారంభించిన కేటీఆర్!

Drukpadam

ఆత్మ‌కూరు ఉప ఎన్నికల బ‌రిలో 28 మంది!

Drukpadam

Leave a Comment