అంతర్జాతీయం

భార్యతో విడిపోయినట్టు ప్రకటించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

  • 18 ఏళ్ల వివాహబంధానికి ముగింపు పలికిన జస్టిన్ ట్రూడో దంపతులు
  • సోషల్ మీడియాలో ప్రకటన
  • 2005లో వివాహం బంధంలోకి అడుగుపెట్టిన జస్టిన్, సోఫీ

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన భార్య సోఫీ తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని వారు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్‌పై ఇరువురు సంతకాలు కూడా చేసినట్టు ట్రూడో కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ట్రూడో(51), సోఫీ(48) 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. 

జస్టిన్, సోఫీ ప్రస్తుతం తమ పిల్లలను ఓ భద్రమైన ప్రేమపూరిత వాతావరణంలో పెంచడంపైనే దృష్టి పెట్టారని ట్రూడో కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. వారంతా ఎప్పటికీ ఓ కుటుంబమేనని వెల్లడించింది.

గతంలో కెనడా ప్రధానిగా పనిచేసిన తన తండ్రి కూడా ఇదే విధంగా విడాకులు తీసుకోవడం గమనార్హం ….

Related posts

మళ్లీ తడబడిన బైడెన్.. డెమోక్రాట్లలో టెన్షన్…

Ram Narayana

ప్రాణభయంతో భారత్ లోకి వస్తున్న మయన్మార్ సైనికులు… అమిత్ షా స్పందన

Ram Narayana

దావోస్ సదస్సులో ట్రూడో, కేటీ పెర్రీల ప్రేమాయణం… కెమెరాకు చిక్కిన రొమాంటిక్ మూమెంట్!

Ram Narayana