Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు మార్చిందో అందరికీ తెలుసు: మల్లు భట్టివిక్రమార్క

  • బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించిన మల్లు భట్టి
  • బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్య
  • తుమ్మల సహా బేషరతుగా పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని వెల్లడి

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ… బేషరతుగా పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మి పార్టీలోకి వస్తే ఎవరినైనా చేర్చుకుంటామన్నారు. అలాగే తుమ్మలకు ఆహ్వానం ఉంటుందన్నారు. ఆయనతో చర్చలు జరుగుతున్నాయా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అది పార్టీ అంతర్గత అంశమన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను మల్లు భట్టి ఖండించారు. దేశ హోంమంత్రిగా ఆయన జాగ్రత్తగా మాట్లాడాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి కాదని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే ఒకటి అని అన్నారు. అందుకే కేసులను నీరుగార్చారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు మార్చారో కూడా ప్రజలందరికీ తెలుసు అని చెప్పారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు. బీఆర్ఎస్ తమ పథకాలను కాపీ కొడుతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తమ హయాంలో లాక్కున్న దళితుల భూములను తాము అధికారంలోకి రాగానే ఇచ్చేస్తామన్నారు.

Related posts

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ ముందు అనేక సవాళ్లు ..

Ram Narayana

గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల సిఫార్స్ లో అధికార పార్టీకి గవర్నర్ తమిళశై షాక్ …!

Ram Narayana

తుమ్మల వద్దకు కేసీఆర్ రాయబారం …?

Ram Narayana

Leave a Comment