Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

త్రాగునీటికి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టిన మంత్రి పువ్వాడ

త్రాగునీటికి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టిన మంత్రి పువ్వాడ.

౼ అనతికాలంలోనే త్రాగునీటి సమస్యలను అధిగమించిన వ్యూహం.

౼ చెక్ డ్యాం నిర్మాణంతో మండు వేశవిలో నిండు కుండలా మున్నేరు..

౼ ఏళ్ల నిర్లక్ష్యానికి తెర.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి.

౼ హర్షం వ్యక్తం చేస్తున్న నగర ప్రజలు.

ఒకప్పుడు ఖమ్మం నగరంలో త్రాగునీటికి కటకటలాడే ప్రజలు నేడు ఎటు చూసినా త్రాగునీటిని చూడగలుగుతున్నారు, పొందగలుగుతున్నారు. అకుంఠిత కార్యదీక్ష ఉంటే ఎలాంటి సమస్యనైనా సాదించగలం అని అనేక మార్లు నిరూపించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . అందులో ఒకటి మున్నేరుపై చెక్ డ్యాం నిరణం.

ఖమ్మం పట్టణంలో ప్రధానంగా 3టౌన్ ప్రాంతంలో మే నెలలో త్రాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునేవారు.. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించిన మంత్రి పువ్వాడ దేనికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఖమ్మం నగరంలో నిత్యం త్రాగునీరు ట్యాంకర్ లు నిర్విరామంగా తిరుగుతానే ఉండేవి.

ఖమ్మం నగరంలో 3టౌన్ నుండి మున్నేరు ద్వారా వృధాగా నీరు పోవడం సరికాదని, ఏడాది పొడవునా త్రాగునీరు అందుబాటులో ఉండాలని తలంచి, మున్నేరు పై చెక్ డ్యామ్ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుమతులు ఇచ్చారు. రూ.7.45 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఆయా నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేసి పనులను నిత్యం పర్యవేక్షించారు. ఆయా వడి వడిగా కొనసాగురున్నాయి. దాదాపు పూర్తి కావచ్చాయి కూడా.

ఇటు ఖమ్మం 3టౌన్ తోపాటు, ఖమ్మం మొత్తం ప్రాంతానికి త్రాగునీటికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు మంత్రి పువ్వాడ. ఒకప్పుడు అమ్మలు, అక్కలు బిందెలు పట్టుకొని లైన్ లోనిలబడి ఎక్కడికో పోయి నీరు తేచ్చుకోవాల్సిన పరిస్థితిని అధిగమించి నేడు త్రాగునీటిని అందుబాటులోకి తెచ్చారు. మన అన్నగా కష్టాలు అర్ధం చేసుకుని చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తి అయితే సంవృద్దిగా త్రాగునీరు అందుబాటులో ఉండనున్నాయి.

ఖమ్మం పట్టణంలో మండుటెండలో సహితం భూగర్భ జలాలు పెరిగి బోర్లల్లో నీరుకూడా పెరిగి ఇబ్బంది లేకుండా ఉంది. తద్వారా తాగునీరే కాదు సాగునీరుకుడా పక్కగ్రామాల్లో రైతులకు అందుతుంది.. ఖమ్మం రూరల్, ముదిగొండ కొంత ప్రాంతం రైతులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు..మంత్రి నిరంతరం ప్రజల గురించి, వారి కష్టాల గురించి వారి సమస్యల గురించి ఆలోచిస్తూ ఒక శ్రామికుడు లాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఒక పక్క కరోనను అడుపుచేస్తూ.. కేసులు తగ్గిస్తూ మరో పక్క ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరిస్తూ బహుముఖ వ్యూహంతో పని చేస్తూ నిరంతరం పనిచేస్తున్న మంత్రి పనితీరు స్పందన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

Related posts

నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర ప్రగతిపై నివేదిక సమర్పించిన సీఎం జగన్!

Drukpadam

విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఇమ్రాన్ ఖాన్!

Drukpadam

కేసీఆర్ తోనే తన ప్రయాణం : మాజీ మంత్రి తుమ్మల…

Drukpadam

Leave a Comment