Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో హడలెత్తిస్తున్న గొర్రె గేదెలు!

తూర్పుగోదావరి జిల్లా మన్యంలో హడలెత్తిస్తున్న గొర్రె గేదెలు!
  • మారేడుమిల్లి మన్యం ప్రాంతంలో మందలుగా సంచారం
  • రాకపోకలు సాగించలేని పరిస్థితులు నెలకొన్నాయంటూ గిరిజనుల ఆవేదన
  • ఎండలు, అడవిలో మంటలు వ్యాపించడమే కారణమంటున్న గిరిజనులు

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మన్యంలో గొర్రె గేదెలు (అడవి గేదెలు) ప్రజలను హడలెత్తిస్తున్నాయి. గుంపులుగా రహదారులపైకి, గిరిజన గ్రామాల్లోకి వస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. ఎండలు మండిపోతుండడం, అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపిస్తుండడంతోనే అవి రోడ్లపైకి వస్తున్నాయని గిరిజనులు చెబుతున్నారు.

మారేడుమిల్లి నుంచి గుజ్జుమామిడివలస, కుండాడ పంచాయతీల పరిధిలోని గ్రామాలకు వెళ్లేదారుల్లో వీటి బెడద మరింత ఎక్కువగా ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇవి గుంపులుగా సంచరిస్తుండడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మారేడుమిల్లి నుంచి ఉత్తలూరు, కొండవాడలకు వెళ్లే మార్గంలోనూ గొర్రె గేదెలు మందలుగా సంచరిస్తున్నాయని, తమకు రక్షణ కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.

Related posts

ప్రభుత్వం తరుపున మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు… మంత్రి పువ్వాడ …

Drukpadam

ఢిల్లీకి చేరుకున్న 2 లక్షల ట్రాక్టర్లు

Drukpadam

జలగం వెంగళరావుకు వచ్చిన నాకు రాబోతుంది…భట్టి

Ram Narayana

Leave a Comment