Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

సిట్ కార్యాలయానికి లోకేశ్, భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ

  • సిట్ కార్యాలయంలోకి భువనేశ్వరి, నారా లోకేశ్
  • హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన బాలకృష్ణ, బ్రాహ్మణి
  • ఇన్నాళ్లు ఛార్జీషీట్ వేయకుండా ఎందుకు ఊరుకున్నారని బాలకృష్ణ ప్రశ్న

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేశ్‌తో పాటు నందమూరి రామకృష్ణ, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు,  వచ్చారు. చంద్రబాబును కలవడానికి భువనేశ్వరి, లోకేశ్ తదితర కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. లోకేశ్, భువనేశ్వరి సిట్ కార్యాలయంలోకి వెళ్లారు.

విజయవాడ బయలుదేరిన బాలకృష్ణ, బ్రాహ్మణి

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… ఇన్నాళ్లు ఛార్జీషీట్ వేయకుండా ఎందుకు ఊరుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం తాను కూడా ఎన్నో క్యాంపులు ఏర్పాటు చేశానన్నారు. ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టేందుకే ఈ కేసును బయటకు తీశారన్నారు. ఆయనను జైల్లో పెట్టే ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు.

Related posts

బాధితులంతా వైసీపీ వాళ్లే అయితే ఆ కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదు?: హోంమంత్రి అనిత…

Ram Narayana

నేను చంద్రబాబు అంత మంచోడ్ని కాదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

Ram Narayana

ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దర్యాప్తు అధికారి మార్పు వెనక పెద్ద రాజకీయ కుట్ర: ధూళిపాళ్ల నరేంద్ర

Ram Narayana

Leave a Comment