Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

శరద్ పవార్ నివాసంలో I.N.D.I.A. కూటమి సమన్వయ కమిటీ భేటీ

  • ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని సమన్వయ కమిటీ నిర్ణయం
  • అక్టోబర్ మొదటివారంలో భోపాల్‌లో మొదటి సభ నిర్వహించనున్న కూటమి
  • పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతిపై గళమెత్తాలని నిర్ణయం

I.N.D.I.A. కూటమి తొలి సమన్వయ కమిటీ సమావేశం ఈ రోజు ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగింది. ఈ భేటీకి 12 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో మొదటి బహిరంగ సభ నిర్వహించనుంది. బీజేపీ పాలనలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతిపై గళమెత్తాలని నిర్ణయించాయి. కులగణన అంశాన్ని చేపట్టాలని ఈ కమిటీ నిర్ణయించింది. అలాగే సీట్ల పంపకాలను నిర్ణయించేందుకు ఉద్ధేశించిన ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది.

ఈ సమావేశానికి హాజరైన వారిలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), టీఆర్ బాలు (డీఎంకే), సంజయ్ రౌత్ (శివసేన-యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), రాఘవ్ చద్దా (ఆమ్ ఆద్మీ పార్టీ), జావెద్ అలీఖాన్ (ఎస్పీ), సంజయ్ ఝా (జేడీ-యూ), డీ రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) ఉన్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ గైర్హాజరయ్యారు.

Related posts

పోటీ చేసిన రెండుచోట్లా భారీ మెజార్టీతో గెలిచిన రాహుల్ గాంధీ…!

Ram Narayana

రాజస్థాన్‌లోనూ పోటీ చేస్తాం: మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ

Ram Narayana

రాహుల్ గాంధీని పొగిడిన పాక్ మాజీ మంత్రి.. పాక్ లో పోటీ చేస్తున్నాడా ఏంటి? అంటూ బీజేపీ ఎద్దేవా

Ram Narayana

Leave a Comment