జాతీయ రాజకీయ వార్తలు

శరద్ పవార్ నివాసంలో I.N.D.I.A. కూటమి సమన్వయ కమిటీ భేటీ

  • ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని సమన్వయ కమిటీ నిర్ణయం
  • అక్టోబర్ మొదటివారంలో భోపాల్‌లో మొదటి సభ నిర్వహించనున్న కూటమి
  • పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతిపై గళమెత్తాలని నిర్ణయం

I.N.D.I.A. కూటమి తొలి సమన్వయ కమిటీ సమావేశం ఈ రోజు ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగింది. ఈ భేటీకి 12 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో మొదటి బహిరంగ సభ నిర్వహించనుంది. బీజేపీ పాలనలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతిపై గళమెత్తాలని నిర్ణయించాయి. కులగణన అంశాన్ని చేపట్టాలని ఈ కమిటీ నిర్ణయించింది. అలాగే సీట్ల పంపకాలను నిర్ణయించేందుకు ఉద్ధేశించిన ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది.

ఈ సమావేశానికి హాజరైన వారిలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), టీఆర్ బాలు (డీఎంకే), సంజయ్ రౌత్ (శివసేన-యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), రాఘవ్ చద్దా (ఆమ్ ఆద్మీ పార్టీ), జావెద్ అలీఖాన్ (ఎస్పీ), సంజయ్ ఝా (జేడీ-యూ), డీ రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) ఉన్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ గైర్హాజరయ్యారు.

Related posts

మా కూటమి పేరు ‘భారత్’ అని పెట్టుకుంటే దేశం పేరును బీజేపీగా మారుస్తారా?: కేజ్రీవాల్

Ram Narayana

కేరళ, అసోం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్… ఫలితాలపై సర్వత్రా ఆసక్తి…

Ram Narayana

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుంది: ప్రధాని నరేంద్ర మోదీ

Ram Narayana