తెలంగాణ రాజకీయ వార్తలు ..

అమ్మయ్య ఒక పని అయిపొయింది…. తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు …!

అమ్మయ్య ఒక పని అయిపొయింది…. తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు …!
ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు… పార్టీలోకి పలువురు నేతల క్యూ
నేడు ఖర్గే ,సిద్దరామయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తుమ్మల
ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి
ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
నిన్న పార్టీలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదెలు, ఆయన భార్య

అమ్మయ్య ఒక పని అయిపొయింది ….సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని తుమ్మల ఎట్టకేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు . ఆయన చేరికపై జరుగుతున్నా రకరకాల ప్రచారాలకు తెరదించుతూ కాంగ్రెస్ లో చేరడంపై తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక ఘట్టంగానే చెప్పవచ్చు …

అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్న వేళ కాంగ్రెస్ ,బేర్ యస్ నువ్వా నేనా అనేవిధంగా ఎన్నికల కురుక్షేత్రం జరగనున్నది . బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జునఖర్గే , కర్ణాటక సీఎం సిద్దరామయ్య సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు . ఈ కార్యక్రమంలో కేసి వేణుగోపాల్ , మాణిక్యరావు ఠాక్రే , టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు . తన చేరిక సందర్భంగా తన మాటలతో నవ్వులు పూవించారు తుమ్మల …

మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో నేడు జిట్టా కాంగ్రెస్‌ పార్టీలో చేరనుండగా, వేముల వీరేశం 18 లేదంటే 19న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

మరోవైపు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Related posts

ముఖ్యమంత్రి పదవి కంటే జెడ్పీటీసీగా గెలిచినప్పుడే ఆనందం కలిగింది: రేవంత్ రెడ్డి

Ram Narayana

ముఖ్యమంత్రి పదవి ఆశించాను .. డిప్యూటీ సీఎం పదవితో సంతోషంగా ఉన్నా… భట్టి

Ram Narayana

కేటీఆర్ ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఎన్నికల ప్రధాన అధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు 

Ram Narayana