Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

పార్లమెంట్ లో తెలంగాణ గొప్పతనాన్నికేసీఆర్ దార్శనికతను చాటిచెప్పిన నామ …

పార్లమెంట్ లో తెలంగాణ గొప్పతనాన్నికేసీఆర్ దార్శనికతను చాటిచెప్పిన నామ …
నూతన పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ ..
బీసీ, మహిళా బిల్లులను ఈపార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలన్న నామ
కేసీఆర్ దళిత పక్షపాతి కనుకనే తెలంగాణా కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు
కేసీఆర్ సుపరిపాలన వల్ల తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్
హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఘనత కేసీఆర్ ది

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రస్తుత పార్లమెంట్ భవనం అనేక చారిత్రిక నిర్ణయాలకు వేదికగా నిలిచిందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రస్తుతించారు . రేపటి నుంచి సమావేశాలు జరిగే కొత్త పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలనికేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్ లో ఎంపీ నామ మాట్లాడారు. తెలంగాణా సీఎం కేసీఆర్ మెరుగైన సుపరిపాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉందని పేర్కొంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణా నూతన సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా హైదరాబాద్ లో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దళిత పక్షపాతిగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా దళిత బంధు పధకం ప్రవేశపెట్టి, దళితులకు రూ.10 లక్షల వంతున వారి అభివృద్ధికి సాయం చేయడం జరుగుతుందన్నారు. ఇంకా రైతు బంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణా అని అన్నారు. నేడు కేసీఆర్ సుపరిపాలన వల్ల తెలంగాణ అన్నింటా నెంబర్ వన్ గా ఉందన్నారు. ఇదే పార్లమెంట్ లో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే , వ్యతిరేకిస్తే ఉపసంహరించుకున్న సంగతిని, 2014లో ఏపీ రీ ఆర్గనేషన్ యాక్ట్ ఆమోదాన్ని గుర్తు చేశారు. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి, అమోదించాలని నామ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ కి లేఖ కూడా రాసిన సంగతిని నామ గుర్తు చేశారు.

75 ఏళ్ల ప్రయాణం … ఈ లోక్ సభ లో …

75 ఏళ్ల ప్రయాణంలో ఈ పార్లమెంట్ లో ఎన్నో బిల్లు లు ఆమోదం పొందాయి .వాటిలో కొన్ని బిల్లుల వలన అభివృద్ధి జరిగింది, అలాగే కొన్నిటి వలన ఇబ్బందులు కూడా వచ్చాయన్నారు. ఇక్కడ వ్యక్తలు అక్కడికి, అక్కడ వ్యక్తులు ఇక్కడి కి మారారని … అయినా దేశం మరో పక్క అన్నిరంగాల్లో ముందుకు పోతుందన్నారు. ఉదయం పీఎం మోడీ గారి స్పీచ్ విన్నాం .. నూతన పార్లమెంట్ లో రాబోయే రోజుల్లో అందరం కల్సి కట్టుగా ఈదేశాన్ని ముందుకు తీసుకుపోవటానికి పని చేయాలి అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన నెహ్రు, పటేల్ వంటి వారు … మొదటి లోక్ సభ స్పీకర్ గణేష్ వాసుదేవ్ మౌలాలంకార్ నుండి నేటి స్పీకర్ ఓం బిర్లా వరకు 17 మంది లోక్ సభ స్పీకర్లు వున్నారు..అందులో తెలుగు వారికి మూడు సార్లు అవకాశం వచ్చింది.. నీలం సంజీవ రెడ్డికి రెండు సార్లు, బాలయోగి ఒక్కసారి స్పీకర్ గా వున్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు అయినప్పుడు దేశ ఆర్ధిక వ్యవస్థ సరిగా లేదు.. వారు ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారు .. తద్వారా దేశం ముందుకు పోయిందన్నారు.పార్లమెంట్ సెషన్స్ గతంలో 150 రోజులు నడిచేవి … ఇప్పుడు తగ్గుకుంటూ 56 రోజులు కు వచ్చాయి ..దీనిపై ఆలోచించాల్సిన అవసరం వుందన్నారు. రైతులు బిల్లులు ఇదే హౌస్ లో ఆమోదించారు … అలాగే విత్ డ్రా చేసుకున్నారు …ఇది ప్రజలు యొక్క పవర్ వల్లనే సాధ్యమైందని మన ప్రజాస్వామ్య గొప్పతనాన్ని గురించి నామ వివరించారు ..

ఒకప్పుడు బీజేపీ కి ఇద్దరు ఎంపీ లు వున్నారు ..ఇప్పడు 300కు పైగా ఉన్నారు .. గత 10 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్నారని తెలిపారు .అలాగే ఇద్దరు ఎంపీ లు వున్నా నాటి తెరాస కోట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు ..
2014 లో ఏపీ విభజన చట్టం వలన యాక్ట్ పాస్ అయి తెలంగాణ రాష్ట్రo ఏర్పడింది … మోడీ గారు ఉదయం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది అన్నారు …అది సరి కాదు అని నామ ఖండించారు .

తెలంగాణ దేశం లో నెం. 1 వుందన్నారు.పర్ క్యాపిట ఇన్కమ్ లో నెం . 1 , పర్ క్యాపిట పవర్ వినియోగంలోనూ నెం . 1 గా వున్నామన్నారు. 33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీ లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా వైద్యరంగంలో కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు ..
తెలంగాణ మోడల్ దేశం లో రావాల్సి వుందని నామ పేర్కొన్నారు.

Related posts

బీజేపీ పైనే కాదు… అనేక సంస్థలతో పోరాటం చేశాం: రాహుల్ గాంధీ

Ram Narayana

జీ-20 విందుకు తనను ఆహ్వానించకపోవడంపై మల్లికార్జున ఖర్గే స్పందన

Ram Narayana

ఓట్ల కోసం ముస్లింలను తిట్టడమే మోదీ పని: అసదుద్దీన్ ఓవైసి ఆరోపణ

Ram Narayana

Leave a Comment