Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

నాడు నరేంద్రమోదీని అరెస్ట్ చేస్తామన్న చంద్రబాబు నేడు జైల్లో ఉన్నారు: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు స్వయంప్రకటిత విజనరీ అని ఎద్దేవా
  • కొత్తగా ఆవిష్కరించే దేనికైనా సృష్టికర్త తనేనని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారని విమర్శ
  • రాజకీయ జీవితంలో అధఃపాతాళానికి వెళ్లిపోయాడని వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత ప్రధాని, నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ హైదరాబాద్‌లో అడుగు పెడితే అరెస్ట్ చేస్తానని చెప్పారని, ఇప్పుడు ఆయనే రాజమండ్రి జైల్లో ఉన్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

‘అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తానన్న చంద్రబాబు అనే వ్యక్తి ఒక స్వయంప్రకటిత విజనరీ. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. పచ్చిఅబద్ధం అని తెలిసి కూడా, కొత్తగా ఆవిష్కరించే దేనికైనా సృష్టికర్త తానేనని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నంలో రాజకీయ జీవితంలోనే అధ:పాతాళానికి వెళ్ళిపోయాడు. విధి చేయు వింతలన్నీ…!’ అంటూ ట్వీట్ చేశారు.

అస్వస్థతకు గురైన సహచర ఎంపీకి విజయసాయి సాయం

నిన్న పార్లమెంట్ గ్రూప్ సెషన్ సందర్భంగా తన వెనుక వరుసలో కూర్చున్న ఓ ఎంపీ ఒకరు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఇది గుర్తించిన విజయసాయిరెడ్డి వెంటనే ఆయనకు నీళ్లు అందించారు. ఆ తర్వాత డాక్టర్‌ను పిలిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Related posts

పార్లమెంట్ ను తవ్వినా ఏదో ఒకటి దొరుకుతుంది.. అసదుద్దీన్ ఓవైసీ

Ram Narayana

బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది …చక్కదిద్దండి …రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు

Ram Narayana

సైలెంట్ గా ఉంటారా? లేక ఈడీ అధికారులను ఇంటికి రమ్మంటారా?: పార్లమెంట్ లో మంత్రి మీనాక్షి లేఖి

Ram Narayana

Leave a Comment