ఆంధ్రప్రదేశ్

జగన్‌కు స్వల్ప అస్వస్థత, మధ్యాహ్నం అపాయింట్‌మెంట్లన్నీ రద్దు!

  • వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ముఖ్యమంత్రి జగన్
  • కేబినెట్ సమావేశం అనంతరం అపాయింట్‌మెంట్లన్నీ రద్దు
  • రేపటి నుంచే ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. రేపటి నుండి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం అనంతరం ఆయన అపాయింట్‌మెంట్లన్నింటినీ అధికారులు రద్దు చేశారు. అంతకుముందు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సమావేశాల వ్యూహాలపై చర్చించేందుకు పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన, బొత్స, పెద్దిరెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌లు పాల్గొన్నారు.

Related posts

కొడుకు, కూతురే కాడెద్దులుగా… ఓ రైతు దయనీయ పరిస్థితి!

Ram Narayana

సెప్టెంబరు 7న చంద్ర గ్రహణం… టీటీడీ కీలక ప్రకటన…

Ram Narayana

అమెరికాలోని అలాస్కా భూభాగాన్ని కుదిపేసిన భారీ భూకంపం… సునామీ హెచ్చరిక జారీ!

Drukpadam