ఖమ్మం వార్తలు

ప్రొఫెసర్ గాలి అరుణకుమార్ హఠాన్మరణం….

ప్రొఫెసర్ గాలి అరుణకుమార్ హఠాన్మరణం….

ఆయన స్వగ్రామం వైరా మండలం పూసలపాడు

వామపక్ష ఉద్యమాలతో సంబంధాలు

వైరా మండలం పూసలపడుకు చెందిన ప్రొఫెసర్ గాలి అరుణకుమార్ (65) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు …ఆయన తండ్రి గాలి వెంకటేశ్వరరావు సిపిఎం పార్టీలో చురుకైన నాయకుడిగా ,సిపిఎం నేత మాజీల ఎమ్మెల్యే స్వర్గీయ బోడేపూడి వెంకటేశ్వరరావు కు అత్యంత సన్నిహితులు …తండ్రి అడుగుజాడల్లోనే విద్యార్ధి ఉద్యమంలో అరుణకుమార్ ఎస్ ఎఫ్ ఐ లో పనిచేశారు . తాను చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీ లోనే ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు . ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగ ఒకరు అమెరికాలో ఉంటున్నారు. హైద్రాబాద్ లో నివాసం ఉంటూనే వ్యవసాయం మీద ఉన్న ఆసక్తితో స్వగ్రామం పూసలపాడులోని తన పొలంలో ప్రత్యేక బాసుమతి వరివంగడాలను పండిస్తున్నారు …తరుచు గ్రామాన్ని సందర్శించడం గ్రామస్తులతో కలుపుగోలుతనంతో ఉండటం .స్నేహితులను కలుసుకోవడం చేస్తున్నతీరు ప్రత్యేకం … ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Related posts

అభ్యుదయ సాహిత్యంతో సమాజ మార్పు..కెవిఎల్

Ram Narayana

పాలేరు ప్రజలకే నాజీవితం అంకితం : ఎమ్మెల్యే కందాళ..

Ram Narayana

కదం తొక్కిన కామ్రేడ్స్…ఎరుపెక్కిన ఖమ్మం

Ram Narayana