Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కలిసి నడుద్దాం బి.ఆర్.ఎస్ ను ఓడిద్దాం – సి.పి.ఐ పాలేరు నియోజకవర్గ సమావేశంలో పొంగులేటి…

కలిసి నడుద్దాం బి.ఆర్.ఎస్ ను ఓడిద్దాం – సి.పి.ఐ పాలేరు నియోజకవర్గ సమావేశంలో పొంగులేటి
ఉమ్మడి జిల్లాలో 10 కి 10 స్థానాల్లో కూటమి గెలవాలి
కొత్తగూడెంలో సాంబశివరావు గెలుపు కోసం ఐక్యతతో కృషి చేయాలి
తొలుత కొత్తగూడెం నుంచి పోటీచేయాలనుకున్న అనివార్యకారణాలవలన పాలేరుకు వచ్చా..

కాంగ్రెస్, సి.పి.ఐ పార్టీల నిర్ణయం మేరకు కలిసి నడుద్దామని మాయల మరాఠీగా
పేరొందిన కే.సి.ఆర్ ను, బి.ఆర్.ఎస్ ను ఓడిద్దామని మాజీ ఎం.పి. పాలేరు నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…పిలుపు నిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలలో కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులను గెలిపించేందుకు…కృషి చేయాలని ఆయన కోరారు…. సి.పి.ఐ పాలేరు నియోజకవర్గ సమావేశం మంగళవారం ఖమ్మం పార్టీ
కార్యాలయంలో జరుగుతుండగా అక్కడకు చేరుకొని మద్దతు కోరారు. ఈ సందర్భంగా పొంగులేటి….మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని బి.ఆర్.ఎస్ ను తప్పక ఓడించాల్సిన పరిస్థితులలో…కాంగ్రెస్ పార్టీలో చేరి పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నామన్నారు. సి.పి.ఐ, కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీచేస్తున్న నేపద్యంలో ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలోను ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని ఐక్యంగా ముందుకు పోవాలని పొంగులేటి కోరారు. కేసీఆర్ ధనబలంతో ముందుకొస్తున్నాడని, దానిని ఎదరించి నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీచేస్తున్న నేపధ్యంలో ఆయన గెలుపు కోసం తన శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. కొత్తగూడెంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని తొలుత తాను పోటీచేయాలని భావించానని, జిల్లా రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో పాలేరుకు వచ్చానని ఆయన తెలిపారు. అదృష్ట వశాత్తు ఉమ్మడి అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి సాంబశివరావు పోటీచేయడం సంతోషకరమని ఐక్యతను చాటి మొత్తం జిల్లాలోని 10 స్థానాలలో గెలిచి సి.పి.ఐ, కాంగ్రెస్ సత్తాచాటాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలసాని లక్ష్మినారాయణ, లేళ్ళ వెంకటరెడ్డి, సి.పి.ఐ నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, దండి సురేష్, మహ్మద్ మౌలానా, సిద్దినేని కర్ణకుమార్,
అజ్మీర రామ్మూర్తి, కర్నాటి బానుప్రసాద్, మిడికంటి వెంకటరెడ్డి, పుచ్చకాయల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో డిప్యూటీ సీఎం భట్టి …

Ram Narayana

న్యూస్ ఇన్ బ్రీఫ్ ……

Drukpadam

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పర్వేక్షించాలి …మంత్రి పొంగులేటి

Ram Narayana

Leave a Comment