పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల భావోద్యేగం…ఒక్కసారిగా కంట కన్నీరు..!
మండల బూతు కమిటీ భాద్యుల సమావేశంలో పాల్గొన్నకందాల
సమావేశంలో ఎంపీ నామ ,ఎంపీపీలు జడ్పీటీసీలు ,ఇంచార్జి జీవన్ కుమార్
సమావేశాన్ని ప్రారంభిస్తూ కన్నీరు ఆపుకోలేక పోయిన కందాల
ఓదార్చిన ఎంపీ నామ , ఇతర నేతలు
కందాల మీకు మేము ఉన్నామని నినదించిన కార్యకర్తలు
పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి బూతు కమిటీలు , మండల ఇంచార్జిలు , పాల్గొన్న సమావేశంలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఒక్కసారిగా భావోద్యేగానికి లోనైయ్యారు ..నా ప్రియమైన కార్యకర్తలకు , గత ఐదు సంవత్సరాలుగా నేను అంటూ ఒక్కసారిగా తన నోటి నుంచి మాటరాలేదు ..కన్నీటి పరవంతమైయ్యారు ….పక్కనే ఉన్న ఎంపీ నామ నాగేశ్వరరావు ఇతర నేతలు లేచి ఆయన్ను వారించారు … ప్రత్యేకించి నామ ఉపేందర్ రెడ్డి గారు వద్దు ,వద్దు మేమంతా ఉన్నాం అంటూ సముదాయించారు … సమావేశానికి వచ్చిన వారంతా షాక్ అయ్యారు …ఈ లోపు కార్యకర్తలు జై కందాల అంటూ నినదించారు …కొందరు మేమున్నామంటూ మద్దతు పలికారు …
మాములుగా కందాల ధైర్యవంతుడు అనే పేరు ఉంది…. అందరికి దైర్యం చెప్పే ఉపేందర్ రెడ్డి ఒక్క సరిగా కంటతడిపెట్టడం అందరిని కదిలించింది…తనకోసం పనిచేస్తున్న కార్యకర్తలను చూసి ఒక్కసారిగా కందాల భావోద్యేగానికి గురైయ్యారని బీఆర్ యస్ నేతలు అన్నారు ..పాలేరు లో ఆయన గెలుపు పట్ల డోకాలేదని బీఆర్ యస్ నేతలు ఆయన అనుయాయులు అంటున్నారు …అసలు కందాల కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని మరికొందరు అంటున్నారు …పాలేరు లో బీఆర్ యస్ తరుపున కందాల పోటీచేస్తుండగా ,కాంగ్రెస్ తరుపున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీచేస్తున్నారు… వీరిద్దరూ మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుంది… ఎవరు గెలుస్తారు …అనేదానిపైనా బెట్టింగులు ,చర్చోప చర్చలు జరుగుతున్నాయి….