Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం బీఆర్ యస్ కకావికలం …కాంగ్రెస్ కు జైకొట్టిన మేయర్ నీరజ…

సరిగ్గా ఐదు రోజుల క్రితం బీఆర్ యస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం పర్యటన సందర్భంగా జరిగిన రోడ్ షో కార్నర్ మీటింగ్ లలో పాల్గొన్న ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పూనుకొల్లు నీరజ బీఆర్ యస్ కు షాక్ ఇచ్చారు …బీఆర్ యస్ కు బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు …ఆమె చేరతారని చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతున్నప్పటికీ అలాంటిది ఏమిలేదని ఆమే స్వయంగా కొట్టి పారేశారు ….అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ వాళ్ళు మేయర్ ఇంటికి వస్తున్నారని అప్పట్లో జరుగుతున్న ప్రచారం పై తీవ్రంగా స్పందించారు …కాంగ్రెస్ వాళ్లకు ఏంపని మా ఇంటికి వచ్చేందుకు మేము పువ్వాడ అజయ్ కి పెద్ద అసెట్ నాకు అతిపెద్ద పదవి మేయర్ గా గొప్ప అవకాశం కల్పించారు …అని మేయర్ నీరజ కాంగ్రెస్ నేతలను తూలనాడారు … పెద్దాయన ప్రస్తుత మంత్రి తుమ్మలపై కూడా నోరు జారారని ప్రచారం జరిగింది .. నిన్నగాకమొన్న భూత్ లెవల్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు … శుక్రవారం మధ్యాహ్నం వరకు బీఆర్ యస్ సమావేశాల్లో పాల్గొని నామ నాగేశ్వరరావు ను గెలిపించాలని చెప్పిన మేయర్ వైఖరి విమర్శలకు దారితీసింది …ఇవేమి రాజకీయాలు అంటూ సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తుంది …నైతిక విలువల గురించి చెప్పిన మేయర్ అవి ఎక్కడకు పోయాయని ప్రశ్నిస్తున్నారు … అల్ ఆఫ్ సడన్ గా ఆమెకు బీఆర్ యస్ లో జరిగిన నష్టం ఏమిటని నిలదీస్తున్నారు …

మరి ఏమి జరిగిందో ఏమో గాని ఖమ్మం ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు …ఇటీవల హైద్రాబాద్ లో ఉన్న తుమ్మల దగ్గరకు స్వయంగా వెళ్లిన మేయర్ నీరజ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్న మాటలకూ పశ్చాతాపం ప్రకటించినట్లు సమాచారం …ముందు ఆమె చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన మంత్రి తుమ్మల చివరకు పార్టీలో చేరికకు అంగీకరించారు ..దీంతో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మంత్రి తుమ్మల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మేయర్ తోపాటు 11 డివిజన్ కార్పొరేటర్ , సరిపుడి రమాదేవి , 13 డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ లకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ….ఈ కార్యక్రంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ , కాంగ్రెస్ నాయకులూ కామార్థపు మురళి తదితరులు పాల్గొన్నారు …

ఇప్పటికే అనేకమంది కార్పొరేటర్లు బీఆర్ యస్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే …అదే బాటలో నడిచేందుకు పలువురు కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు …దీంతో ఖమ్మం బీఆర్ యస్ కకావికలం కానున్నది … అత్యంత ప్రతిష్టాత్మకంగా లోకసభకు ఎన్నికలు జరుగుతున్న వేళ జరుగుతున్న ఈపరిణామాలు బీఆర్ యస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి… కార్పొరేటర్లే కాకుండా వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు ఆయా డివిజన్లలో పార్టీకి దూరం జరుగుతున్నారు…అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరికలను కట్టడిచేసిన మాజీమంత్రి పువ్వాడ అజయ్ ప్రస్తుతం మౌనంగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి …పలువురు బీఆర్ యస్ నేతలు కార్యకర్తలు పార్టీ పిలుపులకు స్పందించడంలేదు …ఈపరిణామాలను రాజకీయ పరిశీలకులు నిశితంగా గమనిస్తున్నారు …

Related posts

ఈసారి మోదీ వస్తే ఇక ఎన్నికలు ఉండవు..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

Ram Narayana

ఖమ్మంలో కలిసిన మంత్రులు …కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సమిష్టి వ్యూహం దిశగా అడుగులు…

Ram Narayana

ఖమ్మంలో ధనస్వామ్యని ఓడించండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి…

Ram Narayana

Leave a Comment