Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి ఆత్మహత్య

  • నిజామాబాద్ అర్బన్ నుంచి అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన కన్నయ్యగౌడ్
  • కన్నయ్య మొబైల్‌ను హ్యాక్ చేసి మార్ఫింగ్ వీడియోలు పంపి దుండగుల వేధింపులు
  • డబ్బుల కోసం బెదిరిస్తుండడంతో ఉరివేసుకుని ఆత్మహత్య

తెలంగాణ శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలోకి దిగిన యమగంటి కన్నయ్యగౌడ్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. కన్నయ్య ఇటీవల అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశాడు. ఆయన మొబైల్‌ను ఇటీవల హ్యాక్ చేసిన దుండగులు మార్ఫింగ్ వీడియోలను పంపి బెదిరించారు.

డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపానికి గురైన కన్నయ్య ఈ తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్టు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

పల్లా రాజేశ్వర్ రెడ్డికే జనగామ టికెట్..ముత్తిరెడ్డికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి…! 

Ram Narayana

కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంత మోసం,దగా … మంత్రి పువ్వాడ అజయ్ ధ్వజం…

Ram Narayana

మూర్ఖుడు, దుర్మార్గుడు అంటూ చంద్రబాబుపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment