Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

 డిసెంబర్ 9 తర్వాత నీ సంగతి చూస్తాం: బోధన్ ఏసీపీకి రేవంత్ రెడ్డి వార్నింగ్

  • నిజామాబాద్ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి
  • సభ సమయంలో పోలీసులపై రేవంత్ రెడ్డి ఆగ్రహం
  • బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరించవద్దని సూచన

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం నిజామాబాద్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ ఏసీపీకి వార్నింగ్ ఇచ్చారు. ఓ అంశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరించవద్దని ఆగ్రహించారు. డిసెంబర్ 9వ తేదీ తర్వాత నీ సంగతి చూస్తామని వ్యాఖ్యానించారు. 

పదవి పోతుందనే భయం పట్టుకుంది

నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్ర సందర్భంగా సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కు పదవి పోతుందనే భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని చెబుతున్నాడని, కానీ 80కి పైగా సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు నిజామాబాద్ సాక్షిగా చెబుతున్నానని.. 80 సీట్లకు తగ్గితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు.

Related posts

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి …

Ram Narayana

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ ముందు అనేక సవాళ్లు ..

Ram Narayana

తెలంగాణ కాంగ్రెస్ ‘స్పెషల్ మేనిఫెస్టో’ విడుదల

Ram Narayana

Leave a Comment